టాలీవుడ్‌లో కాజల్ ట్రిపుల్ ధమాకా.!

కాజల్ అగర్వాల్ తల్లి అయ్యాకా, సీనియర్ హీరోలకు ఫస్ట్ ఆఫ్షన్ అయ్యింది. కెరీర్ ముగిసిపోయిందనుకున్న టైమ్‌లో మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో ఛాన్స్ కొట్టేసి బౌన్స్ బ్యాక్ అయ్యింది చందమామ. ఆ తర్వాత ‘ఆచార్య’లో రెండో సారి మెగాస్టార్‌తో జత కట్టాలి. మిస్ అయ్యింది.

ఇప్పుడు బాలయ్య సరసన కాజల్ నటించబోతోందనీ ప్రచారం జరుగుతోంది. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబో మూవీలో కాజల్ హీరోయిన్ అని మాట్లాడుకుంటున్నారు. కాగా, తాజా సోర్సెస్ ప్రకారం కాజల్ అగర్వాల్ మరో రెండు బంపర్ ఛాన్సులు కొట్టినట్లు తెలుస్తోంది. అవి కూడా స్టార్ హీరోలతోనే అని మాట్లాడుకుంటున్నారు. అందులో ఓ యంగ్ హీరో కూడా వున్నట్లు తెలుస్తోంది.

అంటే, చందమామ కెరీర్ మళ్లీ ఊపందుకున్నట్లే. ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తోంది కాజల్ అగర్వాల్. విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకి శంకర్ దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్ మరో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తోంది.