లీకుల గోల: చరణ్, శంకర్ అసహనం.. కానీ, ఎవరిపైన.?

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. సాధారణంగా శంకర్ సినిమాలంటే, వాటి షూటింగ్ వ్యవహారాలు పకడ్బందీగా వుంటాయ్.

అయితే, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది పరిస్థితి. స్టిల్స్ లీక్ అవుతున్నాయి. స్టోరీ లైన్ గురించి కూడా లీకులు బయటకు వస్తున్నాయి. మామూలుగా అయితే, ఇలాంటి లీకుల్ని అస్సలు క్షమించడు శంకర్. రామ్ చరణ్ సంగతి సరే సరి. ఆ బాధ్యత పూర్తిగా దర్శకుడికే వదిలేస్తాడు, లీకుల్ని ప్రోత్సహించడు.

తాజాగా, రామ్ చరణ్ – శంకర్ సినిమాకి సంబంధించి కొన్ని ఆన్ లొకేషన్ స్టిల్స్ బయటకు వచ్చేశాయ్. ఈ వ్యవహారంపై అటు చరణ్, ఇటు శంకర్.. ఇద్దరూ గుస్సా అవుతున్నారట.

ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు కీలకంగా వున్నారనీ, వారిపై శంకర్ వేటు వేశాడనీ అంటున్నారు. మరోపక్క, చరణ్ కూడా ఈ విషయమై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

శంకర్ పూర్తిగా ఈ సినిమా మీద ఫోకస్ పెట్టకుండా, మధ్యలో ‘భారతీయుడు-2’కి వెళ్ళడం వల్ల కాన్సన్‌ట్రేషన్ దెబ్బ తింటోందా.? అందుకే శంకర్ గతంలోలా ప్రొఫెషనల్‌గా వుండడంలేదా.? అన్న అనుమానం చరణ్‌కి కలుగుతోందిట.