ఇండస్ట్రీ టాక్ : తన సాంగ్ తనే రీమేక్ చేస్తున్న చిరు.?

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో రీమేక్ సినిమాలు చేసే ప్రస్తావన వస్తే వాటిలో మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అలాగే వెంకటేష్ ల పేర్లే ఎక్కువ వినిపిస్తాయి. అయితే వీరు ఇప్పటికీ రీమేక్ సినిమాలు చేస్తున్నారు కానీ ఇంట్రెస్టింగ్ గా మెగాస్టార్ చిరంజీవి అయితే ఓ రీమేక్ లో మళ్ళీ తన సినిమా సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నట్టుగా సినీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.

ఇక మరిన్ని డీటెయిల్స్ చూస్తే ప్రస్తుతం చిరంజీవి తమిళ సినిమా వేదాళం కి రీమేక్ గా దర్శకుడు మెహర్ రమేష్ తో “భోళా శంకర్” గా చేస్తున్న సంగతి తెలిసిందే. ,మరి వాల్తేరు వీరయ్య సినిమా హిట్ ఊపులో దీనిపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

కాగా ఇందులో మెగాస్టార్ కెరీర్ లో ఉన్న ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన రామ్మా చిలకమ్మా సాంగ్ ని రీమేక్ చేస్తున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. చూడాలని ఉంది సినిమాలో మణిశర్మ సంగీతం ఇచ్చిన ఈ సాంగ్ ఇప్పటికా పెద్ద హిట్. అయితే ఈ సాంగ్ ని మళ్ళీ చిరంజీవి హీరోగా మణిశర్మ కొడుకు మహతి సాగర్ సంగీతం లో రీ క్రియేట్ చేసినట్టుగా ఇప్పుడు ఇండస్ట్రీ టాక్.

మహతి సాగర్ వర్క్ కూడా చాలా బాగుంటుంది మరి మెగాస్టార్ రేంజ్ ని మ్యాచ్ చేసే సంగీతం అయితే తాను ఇస్తున్నాడా లేదో వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే అతి త్వరలోనే సినిమా రిలీజ్ కి రానుంది.