హరికృష్ణ పెళ్లి పత్రిక ఎలా ఉందో చూడండి

టిడిపి సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ దుర్మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, నేతలు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా హరికృష్ణ అభిమానులు ఆయనకు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ నాటి విషయాలను గుర్తు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో హరికృష్ణ బాల నటుడిగా, యువనటుడిగా నటించిన చిత్రాల్లో ఫోటోలు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి ఫోటోలు, ఎన్టీఆర్ చైతన్య రథయాత్రలో నడుపుతున్న ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. హరికృష్ణ వివాహానికి సంబంధించిన శుభలేఖను కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం గమనార్హం.

నందమూరి హరికృష్ణ, లక్ష్మీ కుమారిల వివాహం 1973 ఫిబ్రవరి 9న నిమ్మకూరులో జరిగింది. హరికృష్ణ తండ్రి ఎన్టీఆర్ తల్లిదండ్రులు నందమూరి లక్ష్మయ్య చౌదరి, వెంకట్రావమ్మల పేరిట ఈ శుభలేఖ ఉండటం గమనార్హం. హరికృష్ణ పెళ్లి పత్రిక కింద ఉంది చూడండి.