ఏసీబీ సునీతా రెడ్డికి గుడ్‌న్యూస్

ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి గుర్తుంది కదా.. తన కింద పని చేసిన సీఐ మల్లిఖార్జున్ రెడ్డితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు చర్చనీయాంశం కావడంతో దీనిని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సర్కారు వారిద్దరిని జనవరి 23, 2018 న సస్పెన్షన్ చేశారు. ఇప్పుడా సస్పెన్షన్ ఎత్తివేస్తూ సునీతారెడ్డికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆమె బుధవారం డిజిపి ఆఫీసులో రిపోర్టు చేసారు. ఇంతకీ సునీతా రెడ్డి కేసు విషయాలేంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

సునీతా రెడ్డి ఏసీబీలో ఏఎస్పీ గా పనిచేస్తున్నారు. మల్లిఖార్జున్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో సీఐగా పనిచేస్తున్నారు. సిఐ మల్లికార్జున్ రెడ్డి అంతకు ముందు ఏసీబీ లొనే పని చేసారు. పలు కేసులకు సంబంధించి తరచూ వీరు కలుస్తుండటంతో వారిద్దరి సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారితీసింది. సునీతా రెడ్డి భర్త సురేందర్ రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. ఆయన ఎప్పుడూ ఫోన్ చేసినా సరిగా మాట్లాడకుండా ఏదో పనులు ఉన్నాయంటూ సునీత తప్పించుకునేదట. సురేందర్ హైదరాబాద్ కు వచ్చినప్పుడు వారు నివాసముంటున్న అపార్టుమెంట్ వాళ్లు తరచు సిఐ ఇంటికి వస్తుంటారని, చాలా సన్నిహితంగా ఉంటారని సురేందర్ కు చెప్పారు. సురేందర్ అనుమానం బలపడింది. వారిపై నిఘా ఉంచిన సురేందర్ వారిద్దరు కలిసి ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మీడియాకు, బంధువులకు చూపించాడు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది.

కట్టుకున్న భార్య వివాహేతర బంధం సాగిస్తుండగా సునీతా రెడ్డి భర్త సురేందర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2016 నుంచే తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని సురేందర్ రెడ్డి అప్పట్లో ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని పెద్ద మనుషుల్లో పెట్టగా ఇక తప్పు చేయనని ఒప్పుకోవడంతో రాజీ పడ్డానని, ఇలా క్షమించి వదిలేసినా మళ్ళీ వారు తన కళ్లు కప్పి తమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని, క్షమించి వదిలేయడమే నేను చేసిన తప్పా అని సురేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయం లోనే ఏసీబీ లో ఉన్న మల్లికార్జున్ ను కల్వకుర్తి కి బదిలీ చేశారు.

 

సునీతా, సీఐ మల్లిఖార్జున్ రెడ్డి

మల్లిఖార్జున్ రెడ్డి చేతిలో మరో యువతి మోసపోకుండా ఉండాలనే తాను వారిద్దరి పై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని సురేందర్ రెడ్డి అప్పట్లో అన్నారు. సునీత కుటుంబ సభ్యులకు కూడా వారి బాగోతాన్ని ప్రత్యక్షంగా చూపించడంతో .. ఆమె తల్లి, పెద్దమ్మ లు ఆగ్రహాంతో సీఐ మల్లిఖార్జున్ పై చెప్పులతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పోలీసు శాఖ కూడా ముక్కున వేలేసుకున్నట్టయిందని అన్నారు. నలుగురికి చెప్పి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు ఇలా చేయడంతో డిపార్టుమెంట్ అవమానంగా ఫీలయిందని ఓ పోలీసు అధికారి అన్నారు. సునీతారెడ్డి కి సురేందర్ తో పెళ్లి కాకముందే యాంకర్ ఉదయభాను సోదరుడితో మొదటి పెళ్లి అయిందని ఫోటోలు బయటకు వచ్చాయి. మొదటి భర్త మీద సునీత వేధింపుల కేస్ పెట్టినట్లు ప్రచారం అయింది. తన భార్య మీద కోపం తోనే సునీతారెడ్డి రెండో భర్త ఆమెను వివాదంలోకి గుంజినట్లు విమర్శలు ఉన్నాయి.

మొత్తానికి సునీతా రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం ఆమెకు శుభవార్తను అందించింది. దీనిపై సునీతా భర్త ఏ విధంగా స్పందించనున్నారో చూడాలి.