కేజీఎఫ్ భామని మహా ‘ముదురు’.. అనేశాడట.

శ్రీనిధి శెట్టి.. ఈ పేరుకు పరిచయం అస్సలు అక్కర్లేదు. ‘కేజీఎఫ్’ సినిమాతో క్వీన్ అనిపించుకుంది శ్రీ నిధి శెట్టి. పిచ్చ పిచ్చగా పాపులారిటీ అయితే  దక్కించుకుంది కానీ, అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోతోందీ అందాల భామ.

వాస్తవానికి ‘కేజీఎఫ్’ ఇచ్చిన క్రేజ్‌కి భాషతో సంబంధం లేకుండా బోలెడంత బిజీ అయిపోవాలీ భామ. కానీ, అలా జరగలేదు. ఆలస్యంగానైనా ఎట్టకేలకు తెలుగులో అడుగుపెడుతోంది. అయితే సీనియర్ హీరో వెంకటేష్‌తో స్ర్కీన్ షేర్ చేసుకుంటోంది శ్రీ నిధి శెట్టి.

అంతకు ముందే ఓ యంగ్ హీరో సరసన ఆమెను ఓ నిర్మాత, దర్శకుడు ట్రై చేశారట. కానీ, సదరు హీరో ఆమెని రిజక్ట్ చేశాడట. తన పక్కన ముదురుగా కనిపిస్తుందని శ్రీనిధి శెట్టి ఓకే చెప్పినా ఆమెని వద్దనేశాడట ఆ హీరో.

ఎవరా హీరో.? ఏమా కథ.? అని ఆరా తీస్తే, అబ్బే అది మాత్రం కాన్ఫిడెన్షియల్ అని బయటికి రానియ్యకుండా దాచేస్తున్నారట. అయితే, బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్‌లో వున్న యంగ్ హీరో అని మాత్రం తెలుస్తోంది. స్టార్‌డమ్ వున్నా ఈ మధ్య, బాబుకి పాపం కాలం కలిసి రావడంలేదు. అందుకే ఎందుకు రిస్క్ అనుకున్నాడో ఏమో.!