Crime Reel Movie Review: క్రైమ్ రీల్ మూవీ రివ్యూ & రేటింగ్ !!!

అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై సంజన అన్నే దర్శకత్వం వహిస్తున్న సినిమా క్రైమ్ రీల్. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే ఈ సినిమాతో దర్శకురాలిగా మారడం విశేషం. ఈ చిత్రం జులై 19న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సినిమా ఇలా ఉందొ రివ్యూలో చూద్దాం.

కథ: (భరత్ ) ఆంజి, (సిరి ) మౌనిక బావ మరదళ్లు మౌనిక అంటే భారత్ కు ఇష్టం కానీ మౌనిక అంజనీ అస్సలు పట్టించుకోదు తనకు సినిమాలో నటించాలని ఆశక్తి ఈ క్రమంలో తనకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని (అదిరే అభి) జాని అనే మేనేజర్ , మౌనిక ను మోసం చేస్తాడు… జాని చేతిలో మోసపోయిన మౌనిక అనుకోని రీతిలో ఒక సందర్భంలో రేప్ అండ్ మర్డర్ అవుతుంది. మౌనిక ఎలా రేప్ అండ్ మర్డర్ అయ్యిందో తెలుసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్.ఐ గా వర్క్ చేసే మాయ (సంజన) మరియు కానిస్టేబుల్ గా చిత్ర గుప్త (పింగ్ పాంగ్ సూర్య ) ఎలా కనిపెట్టారు అనేదే క్రైమ్ రీల్ మెయిన్ కథ. ఈ ఎపిసోడ్ మధ్యలో చాలా జరుగుతాయి.. చాలా పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పడి , ఇంస్టాగ్రామ్ లో అమ్మాయిలు రీల్స్ చేస్తూ చాలమంది యువత మోసపోతున్నారు… ఇలాంటి సంఘటనల ఆధారంగా క్రైమ్ రీల్ సినిమా కథాంశం ఉంటుంది.

విశ్లేషణ: అన్నే క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కోటేశ్వర రావ్ ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా క్రైమ్ రీల్ సినిమాను నిర్మించారు. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంజన అన్నే క్రైమ్ రీల్ సినిమాతో దర్శకురాలిగా మారారు. మొదటి సినిమానే అయినా అనుభవం కలిగిన దర్శకురాలిగా సినిమాను చిత్రీకరించారు. తాను ఎంచుకున్న పాయింట్ ప్రస్తుతం సోషల్ మీడియా వల్ల యువత ఎలా చెడిపోతోంది అనే విషయాన్ని అద్భుతంగా చూపించారు.

సోమిశెట్టి రాజేష్ అందించిన రెండు పాటలు బాగున్నాయి, ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫర్ బాబు కొల్లాబత్తుల తన టాలెంటెడ్ ను చూపించారు, కెమెరా వర్క్, లైటింగ్ బాగుంది, విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యింది. సాగర్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. నటీనటులు విషయానికి వస్తే భారత్, సిరి చౌదరి నూతన నటీనటులు అయినా సరే బాగా నటించారు. అదిరే అభి, పింగ్ పాంగ్ సూర్య,ఆచార్య కృష్ణ, సునీత మనోహర్ వారి పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

క్రైమ్ రీల్ అనేది ప్రతిఒక్కరు చూడాల్సిన సినిమా, ప్రతి మహిళ, చదువుకొనే ప్రతి అమ్మాయి, అబ్బాయి ఈ సినిమా చూడాలి. పిల్లలు సోషల్ మీడియాకు అలవాటై ఎలా చెడు దారుల్లో వెళుతున్నారో ఈ సినిమాలో చూపించడం జరిగింది.

చివరిగా: క్రైమ్ రీల్ అందరిని ఆలోచింపజేస్తుంది.

రేటింగ్: 3/5