చిరు లీక్స్.! నిజంగానేనా.? నటన కాదు కదా.?

‘రంగస్థలం’ సినిమా నుంచీ, మెగా లీక్స్ బయటకు వస్తున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ దగ్గరకొచ్చేసరికి, ఆ లీకులు ఎక్కువైపోయాయ్. ఏమయ్యింది
చిరంజీవికి.? ఇదే చాలామందికి వున్న పెద్ద డౌటానుమానం.

చిరంజీవి ఫన్ కోసం ‘చిరు లీక్స్’ తెరపైకి తెస్తున్నారన్నది చాలామంది అభిప్రాయం. అయితే, వయసు మీద పడ్డంతో చాదస్తం పెరిగిపోయి, అత్యుత్సాహంతో సినిమా సీక్రెట్స్ బయట పెట్టేస్తున్నారన్నది ఇంకొందరి వాదన.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాలోని రవితేజ పాత్ర ఏంటో దాదాపుగా రివీల్ చేసేశారు చిరంజీవి. ప్రకాష్ రాజ్, బాబీ సింహా పాత్రల గురించీ, చివరికి కేథరీన్ పాత్ర గురించి కూడా చిరంజీవి లీక్ చేసేయడం, దర్శకుడు బాబీనీ, అలాగే నిర్మాతల్నీ అయోమయంలో పడేసింది.

సీనియర్ నటుడు, పైగా మెగాస్టార్. ఆయన్ని ఏమీ అనలేరు నిర్మాతలైనా, దర్శకుడైనా. అయితే, ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే. చిరు లీక్స్, అభిమానుల్లో.. అందునా సినీ అభిమానుల్లో సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతున్నాయనేది ఇంకో కోణం.

ఈ విషయంలో చిరంజీవి మహానటుడే సుమీ.. అంటున్నారు చిరంజీవి గురించి బాగా తెలిసినోళ్ళు.