మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు రోజు సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యాడు. ఆ భేటీల్లో ఇతర మంత్రులు, నాగార్జున కూడా పాల్గొన్నారు. అయితే చిరుకు కరోనా అని తెలియడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. కానీ అసలు సంగతిని తాజాగా చిరంజీవి తెలుసుకున్నాడట. తప్పుడు కిట్ల ద్వారా తప్పుడు ఫలితాలు వచ్చాయని అసలు తనకు కరోనాయే లేదని క్లారిటీ ఇచ్చాడు.
కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను తికమక చేసి, నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ అన్న తరువాతా.. బేసిక్ మెడికేషన్ తీసుకోవడం ప్రారంభించాను.. రెండు రోజులైనాఎక్కడా లక్షణాలు లేకపోయే సరికి, నాకే అనుమానం వచ్చి.. అపోలో డాక్టర్స్‌ని అప్రోచ్ అయ్యాను.. వాళ్లు అక్కడ సీటీ స్కాన్ తీసి చెస్ట్‌లో ఎలాంటి ఇబ్బంది లేదని అన్న నిర్దారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ వచ్చాక మరొక్క సారి , మరోచోట నివృత్తి చేసుకుందామని, నేనే టెనెట్ ల్యాబ్‌లో మూడు రకాల కిట్స్‌తో టెస్ట్ చేయించాను.
అక్కడా నెగెటివ్ వచ్చింది. ఫైనల్‌గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగెటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్ట్‌ల తరువాత మొదటి రిపోర్టర్ కిట్‌లోని లోపం వల్ల వచ్చిందని డాక్టర్స్ నిర్దారణకు వచ్చారు. ఈ సమయంలో మీరందరరూ చూపించిన ప్రేమ, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని చిరంజీవి అసలు సంగతిని చెప్పాడు.