ధర్మం ధర్మం: అసెంబ్లీలో పోర్న్ చూస్తున్న బీజేపీ ఎమ్మెల్యే!

పొద్దున్న లేచింది మొదలు ఎవరు ఎలా నడవాలి, ఏ దుస్తులు ధరించాలి, ఎలాంటి అలంకరణ చేసుకోవాలి, పండగలకి ఏమి తినాలి… ఇలా ప్రతీ విషయంలోనూ రూల్స్ & రెగ్యులేషన్స్ అని చెబుతూ.. దానికి హిందూ ధర్మం ట్యాగ్ లైన్ అటాచ్ చేస్తుంటారు బీజేపీ నేతలు. వారు చెప్పే శ్రీరంగ నీతులకు.. చేసే పనులకూ ఏమాత్రం పొంతన లేని ఎన్నో సంఘటనలు ఇప్పటివరకూ వెలుగులోకి వచ్చాయి. వాటికి తోడు మరో వ్యవహారం తాజాగా జనాల్లోకి వచ్చింది.

చ‌ట్టసభలో కూర్చొని ప్రజల సమస్యలపై చర్చించాల్సిన నేతలు, ప్రజలకు సంబంధించిన పనులు చేయాల్సిన ప్రజాప్రతినిధులు, జనాలకు ఏమి కావాలో ఆలోచించాల్సిన నాయకులు… హోదాను, ఉన్నచోటును, ఆ చోటుకున్న గౌరవాన్ని మరిచిపోయి పోర్న్ వీడియోలు చూస్తున్నారు. సమస్యలపై చర్చించమని, ప్రజాసేవ చేయమని అసెంబ్లీకి పంపితే… మూతి తుడుచుకుంటూ.. బూతు సినిమాలు చూస్తున్నారు.

అవును… త్రిపుర‌లో జ‌రుగుతోన్న అసెంబ్లీ స‌మావేశాల్లో బాగ్ బాసా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ‌ద‌బ్ లాల్ నాథ్.. త‌న స్థానంలో ద‌ర్జాగా కూర్చొని పోర్న్ వీడియోలు చూస్తున్నారు. ఆ సన్నివేశం ఇప్పుడు కెమెరాకు చిక్కింది. సభ్యసమాజానికి ఏమి మెసేజ్ ఇద్దామనో కానీ.. ఇలాంటి పనికి ఒడిగట్టారు ఈ బీజేపీ ఎమ్మెల్యే.

నిత్యం మాట‌కు ముందు మాటకు త‌ర్వాత ప్రతీదానికీ ధర్మం, ధర్మం, ధ‌ర్మం కోస‌మే అని మాట్లాడే బీజేపీ నేత‌లు.. నిత్యం అసెంబ్లీలో కూర్చోని పోర్న్ వీడియోలు చూస్తూ దొరికిపోతున్నారు. గ‌తంలో కూడా మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌ఘ‌డ్ లాంటి రాష్ట్రాల్లో సైతం కొంత మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలా ఫోర్న్‌ వీడియోలు చూస్తూ కెమెరాలకు అడ్డంగా బుక్ అయ్యారు. ప్రస్తుతం త్రిపుర ఎమ్మెల్యే ఆ పనికి పూనుకోవడం, ఆ వీడియో వైర‌ల్ అవడంతో.. నెటిజ‌న్లు ఒకరేంజ్ లో ఫైర్ అవుతున్నారు.

కాగా ఇటీవ‌ల జ‌రిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 60 స్థానాలకు గాను బీజేపీ 32 సీట్లను దక్కించుకొని.. అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ మిత్రపక్షం ఐపీఎఫ్‍ టీ ఒక్క సీటు సాధించింది. త్రిపా మోతా – 13, సీపీఎం – 11, కాంగ్రెస్ – 3 స్ధానాలు ద‌క్కించుకున్నాయి. ముఖ్యమంత్రిగా మాణిక్ సాహా కొనసాగుతున్నారు.