ఇబ్బంది పెట్టేయొద్దంటున్న అనుష్క.!

అనుష్కకి ఏమయ్యింది.? ఎందుకు వేగంగా సినిమాలు చేసెయ్యలేకపోతోంది.? అనారోగ్య సమస్యలేమైనా వున్నాయా.? బరువు సమస్యగా మారిందా.? చాలా ప్రశ్నలున్నాయ్.

ప్రస్తుతానికైతే, ‘జాతిరత్నాలు’ ఫేం నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో నటిస్తోంది అనుష్క. హీరోయిన్ అని అనొచ్చా.? అంటే, ఏమో.. డౌటే ఈ సినిమాకి సంబంధించి.

తాజాగా, ఓ ప్రముఖ నిర్మాత అనుష్కని సంప్రదిస్తే, ‘ప్చ్.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి సినిమాలు చేయలేను..’ అనేసిందట అనుష్క. అది కూడా ఓ సీనియర్ హీరో సినిమానట.

రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఆఫర్ చేసినా, ‘నన్ను ఇబ్బంది పెట్టేయొద్దు..’ అని అనుష్క చెప్పేసిందట. ఎందుకు అనుష్క అంతలా ఇబ్బంది ఫీలవుతోందబ్బా.?