బన్నీ, చరణ్ ప్యాన్ ఇండియా హీరోలు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ ప్యాన్ ఇండియా మూవీ చేయాలని ఎప్పటి నుంచో అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారట అల్లు అరవింద్. ఓ ప్రముఖ దర్శకుడితో ఆల్రెడీ మంతనాలు మొదలెట్లేశారట అల్లు అరవింద్. అయితే, ప్రస్తుతానికి ఆ వివరాలు సస్పెన్స్.
అయితే, వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కావచ్చని తాజా సమాచారం. కానీ, ఎందుకో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిని వివరాలన్నీ పూర్తి గోప్యంగా వుంచుతున్నారట అల్లు అరవింద్. ఈ ప్రాజెక్ట్ కోసం ఓ టైటిల్ కూడా ఎప్పుడో రిజిస్టర్ చేయించి పెట్టాననీ, ప్రతీ సంవత్సరం ఆ టైటిల్‌ని రెన్యువల్ చేయిస్తూ వస్తున్నాననీ గతంలో ఓ సారి ఆయన చెప్పారు.
అయితే, ఇక ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించే దిశగా ఆయన తెర వెనక అడుగులు వేగంగా కదుపుతున్నారట. ఈ సారి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేయడం పక్కా అంటున్నారు. చూడాలి మరి.