‘పుష్ప ది రైజ్’ అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. నిజానికి, తెలుగు రాష్ట్రాల్లో ‘పుష్ప’ ఏమంత గొప్ప విజయాన్ని అందుకోలేదు. ఆ మాటకొస్తే, ఆంధ్రప్రదేశ్లో ‘పుష్ప ది రైజ్’ నష్టాల్నే చవిచూసింది.
కానీ, జాతీయ స్థాయిలో ‘పుష్ప ది రైజ్’ అనూహ్యమైన సక్సెస్ అందుకోవడం చిత్ర దర్శక నిర్మాతల్నీ, నటీనటుల్నీ ఆశ్చర్యానికి గురిచేసిందన్నది నిర్వివాదాంశం. ఇప్పటికీ ‘పుష్ప’ మేనియాని ఏదో ఒక రూపంలో చూస్తూనే వున్నాం.
అందుకే, ‘పుష్ప ది రూల్’ కోసం మరింత ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మార్కెటింగ్ వ్యూహాల్ని డిజైన్ చేసుకునే పనిలో చిత్ర యూనిట్ బిజీగా వుంది. ఓ వైపు మేకింగ్, ఇంకో వైపు మార్కెటింగ్ వ్యూహాలు ఖరారు చేసుకోవడం.. నిజానికి, ఇది చాలా చాలా పెద్ద టాస్క్.
మార్కెటింగ్ విషయంలో దర్శకుడు రాజమౌళికి సాటి ఇంకెవరూ రారు. అయితే, ‘పుష్ప ది రూల్’ తర్వాత, సినిమా మార్కెటింగ్ అంటే, అల్లు అర్జున్.. అనే అంతా చర్చించుకుంటారట.
మొత్తంగా, సినిమా మార్కెటింగ్ అంతా అల్లు అర్జున్ స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజమే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాజమౌళికి ఎక్కువ పేరొస్తే, ‘పుష్ప’ విషయంలో క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్ ఖాతాలోకి వెళ్ళిపోయింది.