హిట్టు కొట్టిన అక్కినేని బ్రదర్స్..కానీ క్రెడిట్ వాళ్ళకా?

Akkineni Brothers Not Getting Proper Credit Even Got Hit | Telugu Rajyam

అక్కినేని యంగ్ హీరోలకి ఈ ఏడాది మర్చిపోలేనిది అని చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య అలాగే అఖిల్ లు నటించిన లేటెస్ట్ చిత్రాలు “లవ్ స్టోరీ” అలాగే “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” ఫస్ట్ షో ల నుంచే మంచి టాక్ తెచ్చుకున్నాయి. పైగా రెండూ కూడా ఎప్పుడో కంప్లీట్ అయ్యి వాయిదా పడుతూ వస్తున్న సినిమాలే కావడం గమనార్హం. సరే ఎట్టకేలకు రిలీజ్ అయ్యి వారి కెరీర్ లో పెద్ద హిట్స్ గా మారాయి.

కానీ ఫైనల్ గా ఇందులో వాళ్ళకి పెద్దగా క్రెడిట్ లేదు అన్నది విమర్శకుల మాట. కొన్ని సెంటిమెంట్స్ అయితే మన టాలీవుడ్ లో ఉన్నాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం గోల్డెన్ లెగ్ అయినటువంటి పూజా హెగ్డే కి అఖిల్ సినిమా క్రెడిట్ ఇస్తుండగా లవ్ స్టోరీ కి మాత్రం చైతూకి మంచి రెస్పాన్స్ ఇచ్చినా అక్కడ క్రెడిట్ మాత్రం దర్శకుడు శేఖర్ కమ్ముల అలాగే సాయి పల్లవి లకి ఇస్తున్నారు.

దీనితో ఈ ఇద్దరు అక్కినేని బ్రదర్స్ హిట్టు కొట్టినా కూడా పూర్తి స్థాయి క్రెడిట్ ఒక హీరోగా వీళ్ళకి ఇవ్వడం లేదు. దీనికి సమాధానం చెప్పాలి అంటే కంప్లీట్ వీరిపై డిపెండ్ అయ్యి ఒక సినిమా సాలిడ్ హిట్ అయితేనే దొరుకుతుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles