ప్రియుడి కోసం టవరెక్కి… టిఆర్ఎస్ ఎమ్మెల్యేను ఇరికించి (వీడియో)

ప్రేమను బతికించేందుకు ఈ అమ్మాయి సెల్ టవర్ ఎక్కింది. తమ పెళ్లికి టిఆర్ఎస్ ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపించింది. తమ పెళ్లి జరిపిస్తామని హామీ ఇవ్వడంతో టవర్ దిగింది. పూర్తి వివరాలు చదవండి.

యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం, చందుపట్లకు చెందిన వల్లపు జ్యోతి అనే యువతి వలిగొండకు చెందిన రావుల భాస్కర్ తో ప్రేమలో పడింది. గత నాలుగేళ్లుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకుందామని జ్యోతి చెప్పడంతో ఆమె ఎవరో తనకు తెలియదంటూ భాస్కర్ ప్లేట్ ఫిరాయించాడు. దీంతో గత మూడు రోజులుగా జ్యోతి భాస్కర్ ఇంటి ముందు ఆందోళన చేపట్టడింది. అయినా భాస్కర్ కుటుంబసభ్యులు స్పందించలేదు.

దీంతో జ్యోతి శుక్రవారం వలిగొండలో ఉన్న వెంకటేశ్వర సినిమా టాకీస్ వెనుక ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆందోళన తీవ్రతరం చేసింది. దీంతో ఆమె వద్దకు స్థానిక ఆర్డీఓ, ఎసిపి అక్కడికి చేరుకున్నారు. ఆమెను ఎంత బుజ్జగించినా దిగడానికి ససేమరా అన్నది. దీంతో భాస్కర్ తో పెళ్లి జరిపిస్తామని ఆర్డీఓ, ఎసిపి హామీ ఇచ్చారు. దీంతో జ్యోతి టవర్ దిగింది.

తమ పెళ్లికి స్థానిక భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అడ్డుపడుతున్నారని జ్యోతి ఆరోపించింది. ఎమ్మెల్యే అడ్డుకోవడంతో తమకు న్యాయం జరగడంలేదని చెబుతన్నది. తమ పెళ్లి జరిపించకపోతే ఆర్డీఓ, ఎసిపి పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటానని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం జ్యోతి ప్రియుడు భాస్కర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

టవర్ దిగిన తర్వాత జ్యోతి మీడియాతో ఏమన్నారో కింద వీడియోలో చూడండి.