నీటిలో దూకిన అమ్మాయి.. కాపాడిన మత్స్యకారుడు(వీడియో)

నిర్మల్ జిల్లా రాయపట్నం వంతెనపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. నీటిలో ఆ యువతి మునిగిపోతుండగా… అక్కడే ఉన్న ఓ మత్స్యకారుడు అప్రమత్తమయ్యి నాటు పడవ సహాయంతో ఆమెను కాపాడాడు. ఆ యువతికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు.

మంచిర్యాల మండలం రాపూర్ కు చెందిన కళ్యాణికి… జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరుకు చెందిన ప్రవీణ్ తో మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్‌కు రెండు కాళ్లు విరిగి మంచానికి పరిమితయ్యాడు. కుటుంబం గడవడం కోసం కళ్యాణి ఓ ప్రైవేటు పాఠశాలలో టిచర్ గా పనిచేస్తుంది. ప్రవీణ్ నిత్యం కళ్యాణిని అనుమానించడంతో మనస్తాపం చెందిన కళ్యాణి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో మత్స్యకారుడు కాపాడటంతో ప్రాణాలతో బతికి బయటపడింది.