నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి (వీడియో)

నల్లగొండ జిల్లా కేంద్రం శివారు పానగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి బైక్ ను డీకొట్టడంతో బైకుపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యక్తులపై నుంచి లారీ వెళ్లడంతో వారి మృతదేహాలు నుజ్జు నుజ్జయ్యి గుర్తుపట్టకుండా అయ్యాయి. వీరిని యాదాద్రి జిల్లా వలిగొండకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సీసీ టివిలో ప్రమాదం జరిగిన తీరు వీడియో రికార్డయ్యింది. కింద వీడియో ఉంది చూడండి…