వందల కోట్ల విలువైన భూమిలో అంబేడ్కర్ విగ్రహం.. శభాష్ జగన్ 

వందల కోట్ల విలువైన భూమిలో అంబేడ్కర్ విగ్రహం.. శభాష్ జగన్
భారత రాజ్యాంగ నిర్మాత డా.అంబేడ్కర్ కు ఘన నివాళి ఇవ్వడానికి ఎపీ సీఎం వైఎస్ జగన్ సంకల్పించుకున్నారు.  అందుకే విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానంలో అంబేడ్కర్ యొక్క 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పాని నిర్ణయించుకున్నారు.  విగ్రహం ఏర్పాటు చేయనున్న స్వరాజ్ మైదానానికి విజయవాడలో సుధీర్ఘ చరిత్ర ఉంది.  ఈ గ్రౌండ్స్ రాష్ట్రంలో కూడా చాలా పాపులర్.  సిటీకి మధ్యలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఉండటంతో ఈ మైదానానికి భారీ డిమాండ్ ఉంది.  విజయవాడ రియల్ ఎస్టేట్ ధర మేరకు తక్కువలో తక్కువ 600 వందల కోట్ల వరకు ఉంటుదని అంచనా. 
 
 
అంతటి విలువైన భూమిని అభివృద్ది పేరుతో ప్రభుత్వానికి లాభం వచ్చేలా వాడుకుంటారు పొలిటీషియన్స్.  గత సీఎం చంద్రబాబు చేసింది అదే.  మొత్తం మైదానాన్ని విదేశీ కంపెనీకి ఇచ్చేసే ప్రయత్నం చేశారు.  ఆ స్థలంలో కమర్షియల్ కాంప్లెక్స్ లాంటిది కట్టాలని అనుకున్నారు.  అయితే అధికారం కొల్పోవడంతో అది సాధ్యపడలేదు.  కానీ కొత్త సీఎం వైఎస్ జగన్ మాత్రం స్థలం ధర గురించి ఆలోచించలేదు.  అంత విలువైన స్థలంలో అంబేడ్కర్ విగ్రహం ప్రతిష్టిస్తే ఆ మేధావికి, మహా నాయకుడికి ఘనమైన నివాళి ఇచ్చినట్టు ఉంటుందని భావించారు. 
 
 
అనుకున్నదే తడవుగా నిర్ణయం తీసేసుకున్నారు.  విగ్రహంతో పాటు లైబ్రరీ, స్మారక కేంద్రం, ఓపెన్ ఎయిర్ థియేటర్, అధ్యయన కేంద్రం వంటివి కూడా నిర్మించనున్నారు.  అంతేకాదు ఈ మైదనానికి స్వరాజ్ అంబేడ్కర్ మైదానం అని పేరు మార్చనున్నారు.  సంవత్సర కాలంలో ఈ నిర్మాణాలను పూర్తి చేయనున్నారు.  గతంలో చంద్రబాబు కూడా అంబేడ్కర్ యొక్క భారీ విగ్రహం ఏర్పాటు చేస్తామని తుళ్ళూరులో శంఖుస్థాపన చేశారు కానీ నిర్మాణాన్ని విస్మరించారు.  కానీ జగన్ విజయవాడలో విగ్రహం ఏర్పాటు చేస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, దళిత నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  స్వరాజ్ మైదానంలో విగ్రహం పెట్టడం అంటే విజయవాడ నడిబొడ్డులో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మధ్యలో పెట్టినట్టు ఉంటుందని అంటున్నారు.