గుడిలో ప్రసాదం పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి.. ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా?

సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి ప్రసాదం అంటూ వివిధ రకాల పదార్థాలను అందరికీ పెట్టడం మనం చూస్తుంటాము. ఇలా ఏ ఆలయానికి వెళ్లిన స్వామివారి ప్రసాదంగా వివిధ ఆహార పదార్థాలను భక్తులకు పెడుతుంటారు. అయితే ఎప్పుడైనా ఇలా ఆలయంలో ప్రసాదం ఎందుకు పెడతారు ప్రసాదం పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని ఆలోచించారా… మరి ఆలయంలో ప్రసాదం పెట్టడానికి వెనుకున్న కారణం ఏంటి అనే విషయానికి వస్తే..

సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో పోషకాహారం తీసుకుని వెసులుబాటు ఉండదు. వారి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వారి ఆహార విషయంలో కూడా మార్పులు ఉంటాయి. ఇకపోతే బాగా ఉన్నవాళ్లు పేదవారికి సరైన ఆహారం పెట్టమంటే ఎవరు కూడా వారికి ఆహారం పెట్టడానికి ముందుకు రారు. అందుకే బాగా ఉన్నవాళ్లు అప్పట్లో స్వామి వారికి పెద్ద ఎత్తున ప్రసాదాలను పెట్టడం వల్ల తమకు మంచి జరుగుతుందని భావించేవారు. ఇలా దేవతలకు నైవేద్యంగా సమర్పించే పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి శనగలు గుగ్గులు వంటి ఎన్నో రకాల ప్రసాదాలను పెడుతుంటారు.

ఈ విధంగా ఆలయంలో ప్రసాదంగా పెట్టే ఈ ఆహార పదార్థాలలో ఎన్నో పోషక విలువలు కలిగి ఉంటాయి. ఆలయం ముందు పెట్టే ప్రసాదాలలో ఎక్కువగా కాల్షియం పొటాషియం ఐరన్ వంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే నిత్యం దేవాలయాలలో ఇలాంటి పోషకాహారాన్ని ప్రసాదంగా భక్తులకు పెట్టడం వల్ల ప్రతి ఒక్కరూ సరైన పోషకాహారాన్ని అందుకుంటారనే ఉద్దేశంతోనే ఆలయాలలో పెద్ద ఎత్తున ప్రసాదాలను పెడుతూ ఉంటారు.