భోజనం చేసేటప్పుడు కచ్చితంగా పాటించాల్సిన నియమాలివే?

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇలాంటి అన్నం భుజించే ముందు ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా తినాలని పండితులు చెబుతున్నారు.ప్రతిరోజు మన కార్యకలాపాలను కొనసాగించాలంటే మన శరీరానికి శక్తి అవసరం అలా మన శరీరానికి శక్తి కావాలంటే ఆహారం తప్పనిసరి. ఈ విధంగా మనం భోజనం చేసేటప్పుడు ఎన్నో నియమాలను పాటిస్తూ భోజనం చేసినప్పుడే అన్నపూర్ణాదేవి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి అలా కాకుండా కొందరు ఇష్టానుసారంగా భోజనం చేయడం వాటిని పడేయడం చేస్తుంటారు.అయితే భోజనం చేసే సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయానికి వస్తే.

మనం భోజనానికి వెళ్లే ముందు శుభ్రంగా కాళ్లు చేతులను కడుక్కొని భోజనానికి వెళ్ళాలి.అయితే మనం భోజనం చేసే ముందు కొద్దిగా భోజనాన్ని ఎవరికైనా పెట్టి తినాలి. చాలామంది తినేముందు ఒక ముద్ద అన్నం తీసి పక్కన పెడతారు అలా కాకుండా అన్నం తినే ముందు కాస్త అన్నం పక్కకు తీసి బయట కుక్కకు వేయడం వల్ల అన్నపూర్ణాదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. ఇకపోతే భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖం వైపు కూర్చొని భోజనం చేయాలి. ఎల్లప్పుడూ నేలపైనే కూర్చుని భోజనం చేయడం ఎంతో మంచిది.

ఇకపోతే చాలామంది భోజనం చేసేటప్పుడు ఎడమచేతితో వడ్డించుకుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. చాలామంది తినేటప్పుడు శబ్దం చేస్తూ భోజనం చేస్తుంటారు. ఇలా భోజనం చేసేటప్పుడు శబ్దం చేయడం వల్ల మన ఇంటి పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక అన్నం తినేటప్పుడు ఇతరులపై కోపం ప్రదర్శించకూడదు అలాగే నచ్చకపోతే మధ్యలోనే అన్నం వదిలేసి వెళ్ళకూడదు ఇలా చేస్తే అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది.ఇక చాలా మంది సెల్ ఫోన్లు చూస్తూ టీవీలు చూస్తూ భోజనం చేస్తుంటారు. ఎప్పుడూ కూడా మన ధ్యాస మొత్తం భోజనం పై ఉండి త్వరగా భోజనం పూర్తి చేసుకోవాలి.