కార్తీక మాసంలో తులసి వివాహం చేయటానికి తిథి శుభ సమయం ఎప్పుడంటే?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహాలను ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. సరేనా ముహూర్తం తిథి చూసి వివాహాలను జరిపిస్తారు. ఈ క్రమంలోనే ఎంతో పరమ పవిత్రమైన కార్తీకమాసంలో తులసి వివాహాన్ని కూడా ఎంతో ఘనంగా జరిపిస్తారు. తులసి మొక్కకు ఉసిరి కొమ్మకు వివాహం చేయటం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని భావిస్తారు.మరి కార్తీక మాసంలో తులసి వివాహం చేయడానికి సరైన ముహూర్తం తిథి ఎప్పుడు వివాహం ఎలా చేయాలి అనే విషయానికి వస్తే…

తులసి కళ్యాణం కోసం మన ఇంటి ఆవరణ మధ్యలో తులసి మొక్కను నాటాలి అదే విధంగా పక్కనే ఉసిరి కొమ్మని కూడా పెట్టాలి పూజ సామాగ్రి రూపంలో తులసి ముందు మెహందీ, వివిధ రకాల స్వీట్లు, సుహాగ్ వస్తువులు, బియ్యం, వంటి వస్తువులను తులసి ముందు ఉంచి వివాహాన్ని జరిపిస్తారు. పంచాంగం ప్రకారం ఏడాది తులసి వివాహాన్ని నవంబర్ 5వ తేదీ జరిపిస్తారు. ద్వాదశ తిథి నవంబర్ 5వ తేదీ సాయంత్రం 6:08 కి ప్రారంభమై ఆరవ తేదీ సాయంత్రం 5:06 వరుకు ఉంటుంది. ఇక తులసి కళ్యాణానికి నవంబర్ ఆరవ తేదీ మధ్యాహ్నం 1:09 నుంచి 3:18 వరకు తులసి కల్యాణానికి శుభ ముహూర్తం.

ఇక తులసి కళ్యాణం ఎలా జరిపించాలని విషయానికి వస్తే తులసి మొక్కతో పాటు విష్ణుమూర్తి సాలిగ్రామాన్ని ప్రతిష్టించాలి. సాలిగ్రామం లేని వారు ఉసిరి కొమ్మను నాటి పూజించాలి.మొత్తం మండపాన్ని అలంకరించుకొని అనంతరం కలశ స్థాపన చేయాలి. కలశ స్థాపన చేసిన తర్వాత ముందుగా గణేశుడికి పూజ చేయాలి. గణేశ పూజ అనంతరం తులసి చెట్టుకు విష్ణు సాలిగ్రామానికి ధూప దీపాలు వస్త్రాలు దండలు వేసి పూజించాలి. పూజ అనంతరం హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. ఇలా తులసి కళ్యాణం నిర్వహిస్తారు.