మామూలుగా మనం అమావాస్యను అశుభ దినముగా పరిగణిస్తారు; కానీ ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్యకు మాత్రం మినహాయింపు వుంది. ఈ అమావాస్య దినమును శుభముగా భావించడమైనది; అయినప్పటికీ అన్ని సందర్భాలకు శుభ దినముగా పరిగణించరు; అందువల్ల ఈ దినమును శుభదినముగా పిలువడంకన్నా పవిత్రమైన రోజుగా పరిగణించడం సరియైనది.లక్ష్మీదేవిప్రార్ధనలు లక్ష్మి పూజలో లెక్కల పుస్తకాలను అమ్మవారి ముందు ఉంచి ఇలా ప్రార్ధించాలి. ‘ఓ దేవి నీవు అనుగ్రహహించిన సంపదను సత్కార్యానికి మరియు దైవకార్యానికి ఉపయోగించాము. పూర్తి చేసిన లెక్కలను మీ ముందు వుంచుతున్నాము తల్లి. వీటిని అంగీకరించుము.
రాబోయే సంవత్సరంలో కూడా మా లక్ష్యం ఎల్లప్పుడు కొనసాగేటట్లు దీవించు తల్లి’. ‘నేను చేపట్టే ప్రతి కార్యంలో నాతోవుండి నా అవసరాలను తీర్చడానికి నాకు చైతన్యాన్ని ఇచ్చే దైవ శక్తి నాలో వుంది. కాబట్టి ఆ దైవశక్తి కూడా నా భాగస్వామియే. ఏడాది పొడవునా నేను సంపాదించిన ధనము యొక్క లెక్క మరియు దానిని ఉపయోగించిన విధానం, ఈ పుస్తకాలలో చివరి పైసా వరకు లెక్క వ్రాయబడింది. నేను ఈ రోజు మీ ముందు పరిశీలన కోసం ఉంచాను. నీవే సాక్షి తల్లి. నేను మీ నుండి ఏమీ దాచలేను. నేను నిన్ను గౌరవించాను మరియు దైవకార్యానికి మాత్రమే ఉపయోగించాను. ఓ నిష్కలంకమైన మరియు శుద్ధమైన లక్ష్మీదేవి నేను నిన్ను ఎలాంటి అన్యాయమైన చర్యకు ఉపయోగించలేదు’. ‘ఇదంతయు సరస్వతి దేవి అనుగ్రహం వల్లనే సంభవమైనది. నేను విచక్షణ మరియు నైతిక విలువలు కలిగివున్నాను. ఇందువల్లనే నాలోని ఆత్మబలము తక్కువ కాలేదు. నాకు మరియు నా కుటుంబానికి సుఖము, సమాధానము లభించినది. నేను భగవంతుని సహకారంతో ఆయనను స్మరించుకుంటూ ఖర్చు చేశాను.
నేను ధనాన్ని సన్మార్గంలో ఉపయోగించకపోతే నీవు నాతో ఉండవని ఎల్లప్పుడు గుర్తుపెట్టుకున్నాను. అందువల్ల హే లక్ష్మీదేవి, నేను చేసిన ఖర్చును సమ్మతించుటకు మీరు నన్ను దేవునికి శిఫారసు చేయుము; ఎందుకంటే నీ శిఫారసు లేకుండ ఆయన నన్ను మన్నించడు. నా దృష్టికి వచ్చే తప్పులను పునరావృతం చేయకుండా ప్రయత్నిస్తాను. అందువల్ల, హే లక్ష్మీదేవి మరియు సరస్వతి దేవి, మీ కృపను నాకు ప్రసాదించుము మరియు నా ద్వారా జీవితమంతా హితము కొరకు వినియోగించుటకు జరుగనిమ్ము.’ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత : పై విధంగా లక్ష్మీదేవి మరియు సరస్వతిదేవికి ప్రార్థించడమువలన జీవునిలో వున్న కర్తుత్వము సూక్ష్మతలంపు తగ్గి తన స్వభావము అంతర్ముఖమౌతుంది. ఇందువలన నిర్మాణమయ్యే మోహము దానిలో పడకుండ అతని ప్రవర్తనలో వినయశీలత ఏర్పడుతుంది.