కాలభైరవుడు.. సాక్షాత్తు పరమ శివుడి అంశ. ఆస్వామిని భూతప్రేత, రాక్షస, రోగ ఇతరత్రా బాధల నివారణకు ఎక్కువగా ఆరాధించడం
కాలభైరవుడిని పూజిస్తే గ్రహ దోషాలూ, అపమృత్యు గండాలూ తొలగిపోతాయనీ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనీ మంత్రశాస్త్రం చెబుతోంది కాశీ మహానగరం, ఉజ్జయిని తదితర ప్రాచీన క్షేత్రాల్లో కాలభైరవడి ఆలయాలున్నాయి. శివపురాణంలో కాలభైరవ వృతాంతం ప్రకారం ఓసారి మహర్షులకు ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలన్న కోరిక కలిగింది ఎవరు చెబుతారా అని ఆలోచించారు. సృష్టి కర్తను మించిన బ్రహ్మజ్ఞాని ఎవరంటారు? నేరుగా బ్రహ్మ తపస్స చేసుకుంటున్న మేరు పర్వతానికి వెళ్లారు. బ్రహ్మదేవుడు ఆ నిగూఢ రహస్యాన్ని తప్పక బోధిస్తానని మాటిచ్చాడు.
అంతలోనే సృష్టికర్త చుట్టూ ఓ మాయాపొరను కల్పించాడు పరమేశ్వరుడు దీనితో, మనసులో ఏ మూలనో ఉన్న అహంకారం బయటికొచ్చింది పిచ్చి మహర్షులు పరమతత్వం గురించి చెప్పేదేముంది నేనే ఆ మహాతత్వాన్ని స్వయంభువును నేను, విధాతను నేను, సృష్టిస్థితిలయ కారకుడిని కూడా నేనే. మీ ప్రశ్నకు జవాబు కూడా నేనే అంటూ పలికాడు అక్కడే ఉన్న విష్ణుమూర్తికి ఆ మాటలు వినిపిం చాయి. మాయకే మాయలు నేర్పగలిగిన విష్ణుమూర్తిని కూడా మాయా ప్రభావంతో వాదానికి దిగాడు. ఇద్దరూ కలసి వేదాల దగ్గరికి వెళ్లారు.
వేదాలు పురుషరూపాన్ని ధరించి వేదపురుషుడు పరమేశ్వరుడిని కానియాడాడు. ఓంకారం కూడా శివుడే సర్వేశ్వరుడని తెలుపుతుంది. అంతలోనే. దివ్యతేజస్సుతో ముక్కంటి ప్రత్యక్షం అయ్యాడు. ఆ ఆకారాన్ని చూసి బ్రహ్మ ఐదో తల పక్కన నవ్వింది. దీంతో శివుడు బృకుటి ఆగ్రహంతో ముడిపడింది. భయంకరమైన ఆకారంతో కాలపురుషుడు ఉద్భవించాడు.
భయంకరంగా ఉంటాడు కాబట్టి భైరవుడన్న పేరొచ్చింది. పాపాల్ని పరిహరించే వాడిగా పాపభక్షకుడు అయ్యాడు. కాలభైరవడికి కాశీనగరం మీద ఆధిపత్యాన్ని ప్రసాదించాడు మహాదేవుడు.
శివుడి అనుసరించి తన వేలిగోటితో బ్రహ్మ ఐదో తలను తెగ నరికేశాడు కాలభైరవుడు. కానీ, ఆ తల కింద పడకుండా చేతికి అంటుకుంటుంది. అంతలోనే విష్ణువుని కప్పిన మాయ కూడా తొలగింది. శివతత్వాన్ని నోరారా పొగడుతాడు. దీంతో శివుడు శాంతించి విష్ణుమూర్తిని ఆలింగనం చేసుకున్నాడు. చేతికి అంటుకున్న బ్రహ్మకపాలాన్ని మాత్రం కాలభైరవుడు వదిలించుకోలేక పోయాడు ముల్లోకాలూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది కాశీనగరంలో కాలుపెట్ట గానే, కపాలం చేతినుండి విడిపోతుంది. భైరవుడు ఆనంద తాండవం చేశాడు.
కాశీ క్షేత్రంలోని ఈ ప్రాంతమే ‘కపాలమోచన దివ్యతీర్ణంగా ప్రసిద్ధమైంది. ఇక్కడ పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఈ తీర్ధానికి ఎదురుగా కాలభైరవుడు కొలువుతీరి ఉంటాడు. ఈ క్షేత్రంలో మహాభైరవాష్టమిని ఘనంగా జరుపుతారు. కార్తికమాసంలోని కృష్ణపక్ష అష్టమినే కాలాష్టమిగా కాలభైరవ జయం తిగా జరుపుకుంటారు. మార్గశిర కృష్ణపక్ష అష్టమిని మహాభైరవాష్టమిగా నిర్వహించు కునే వారూ కూడా ఉన్నారు. ఆ రోజు కాలభైరవుడి సన్నిధిలో జాగరణ చేస్తారు. రకరకాల భయాలతో బాధపడేవారు ఇక్కడ రక్షరేకులు కట్టించుకుంటారు. దేవుడికి నైవేద్యంగా మద్యాన్ని సమర్పిచడం ఇక్కడి ప్రత్యేకత ఉజ్జయినిలో వెలసిన కాలభైరవుడు కూడా మహాశక్తిమంతుడని భక్తుల నమ్మకం. దిల్లీ నగరంలోనూ కాలభైరవ క్షేత్రం ఒకటుంది. కాలభైరవుడిని ఉపాసిస్తే మనలోని దుర్గుణాలు తొలగి పోతాయని సాధకులు చెబుతారు