నేడే నాగుల చవితి.. పుట్టకు పాలు పోసే సమయంలో చేయాల్సిన ప్రార్థనలివే?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతినెల ఎన్నో పండుగలను చేసుకుంటూ పెద్ద ఎత్తున దేవదేవతలను ఆరాధిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే నేడు నాగల చవితి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పుట్టను సందర్శించి నాగదేవతకు ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్ధతిని నాగుల చవితి అని జరుపుకుంటారు. ఈ నాగుల చవితి రోజు పెద్ద ఎత్తున మహిళలు నాగుల పుట్టను సందర్శించి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఇక ఈ పండుగ రోజు సర్పాలను పూజించడం వల్ల సర్వరోగాలు తొలగిపోతాయని, గర్భాశయ సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పాలి.కుజదోషం కాలసర్పదోషం ఉన్నవారు సైతం నేడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలను చేసి అనంతరం పుట్టలో పాముకు పాలు పోయడం వల్ల దోషాలు తొలగిపోతాయని భావిస్తారు.

ఈ విధంగా పుట్ట దగ్గర వెళ్లి పెద్ద ఎత్తున పూజలు చేసి నాగేంద్రుని అనుగ్రహం మనపై ఉండేలా పూజలు చేయాలి.ఇక పుట్టకు కొంతమంది కొత్త చీరను పెట్టుకుంటారు అదేవిధంగా వివిధ రకాల పండ్లను సమర్పించిన అనంతరం పుట్టలో పాలు పోసి పూజ చేయాలి. ఇక పుట్టలో పాలు పోస్తూ పూజ చేస్తున్న సమయంలో తప్పనిసరిగా ఈ ప్రార్థనను చదువుకోవాలి.

పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా!
గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా!
చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా!
వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా!
పుట్టలోని నాగేంద్రస్వామి!! ఈ ప్రార్థన చేసుకుంటూ పూజ చేయటం వల్ల మనపై ఉన్నటువంటి సర్ప దోషాలు, కుజదోషం తొలగిపోయి ఆయురారోగ్యాలతో ఉంటారని సంతానలేని సమస్యతో బాధపడే వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుందని చెప్పవచ్చు. ఇక తరచూ కలలో పాములు కనిపించేవారు నేడు వెండి పాము ప్రతిమలను పుట్టలో వేయటం వల్ల కలలో పాములు కనిపించవు. ఇక నేడు పుట్టకు వెళ్లేవారు తప్పనిసరిగా చలివిడి వడపప్పును నైవేద్యంగా సమర్పించాలి.