నరక చతుర్దశి రోజు ఆ ప్రదేశంలో దీపం పెడితే చాలు.. ఆ గండం నుంచి బయటపడవచ్చు?

దీపావళి పండుగను పురస్కరించుకొని దీపావళికి ముందు రోజు జరుపుకునే పండుగను నరక చతుర్దశి అంటారు. నరక చతుర్దశి రోజున సత్యభామ నరకాసురుడిని వధించడంతో ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇకపోతే చాలామంది నరక చతుర్దశిని కూడా దీపాలు వెలిగించి ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా నరక చతుర్దశి రోజున యమ దేవుడికి భక్తిశ్రద్ధలతో పూజ చేయడం వల్ల అకాల మరణం నుంచి బయటపడవచ్చని భావిస్తారు.

నరక చతుర్దశి రోజు యమ దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల అకాల మరణం మృత్యు దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ నరక చతుర్థి రోజున మన ఇంటి ప్రధాన గుమ్మం వద్ద దీపం వెలిగించడం ఎంతో మంచిది. ఇలా ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాన్ని వెలిగించి పూజ చేయటం వల్ల యమదేవుడు మన ఇంటి గుమ్మం వరకు వచ్చి ఆగిపోతారని ఇలా అకాల మరణం నుంచి మనం బయటపడవచ్చనీ పెద్దలు చెబుతున్నారు.

అందుకే నరక చతుర్దశి రోజు ఇంటి ప్రధాన గుమ్మం ఇరువైపులా దీపం పెట్టడం మంచిది.హిందూ క్యాలెండర్ ప్రకారం కార్తీక చతుర్దశి తిథి 23 అక్టోబర్ 2022న సాయంత్రం 6.03 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 24న సాయంత్రం 5:27 గంటలకు ముగుస్తుంది. ఇక నరక చతుర్దశి రోజున నరకాసురుడు మరణించడంతో ప్రజలు సంతోషంగా మరుసటి రోజు కూడా దీపాలను వెలిగించి పెద్ద ఎత్తున టపాసులను పేలుస్తూ దీపావళి పండుగను జరుపుకుంటారు.