సహజంగా మానవ జీవితంలో తెలిసో, తెలియకో అనేక పాపాలు చేస్తాం. ముఖ్యంగా గృహస్త ఆశ్రమంలో నేటి కాలంలో కుటుంబ కోసం ఎన్నో పడరానిపాట్లు పడుతుంటాం. కొన్నిసందర్భాలలో అవి తప్పు అని తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి. మరి అలాంటప్పుడు ఆ దోషాలు, పాపాలు పోవాలంటే ఏం చేయాలో తెలియదు. దీనికి పెద్దలు చెప్పిన పరిష్కారాలలో ఒకటి తెలుసుకుందాం…
ఏ నామాలను వినడం వల్ల.. గృహస్త ధర్మంలోవారి పాపాలు నశించిపోతాయో.. అట్టి యోగినీ గణము నామాలను.. పూర్వం స్కందుడు అగస్త్య మహర్షికి చెప్పాడు… వాటిని తెలుసుకుందాం…
‘‘గజాననీ సింహముఖీ గృద్ధ్రాస్యా కాకతుండికా
ఉష్ట్రగ్రీవా, హయగ్రీవా, వారాహీ, శరభాననా
ఉలూకికా, శివారావా మయూరీ వికటాననా
అష్టవక్రా కోటరాక్షీ కుబ్జా వికటలోచనా
శుష్కోదరీ లలజ్జిహ్వా శ్వదంష్ట్రా వానరాననా
ఋకాక్షీ కేకరాక్షీ చ బృహిత్తుండా సురాప్రియా
కపాలహస్తా రక్తాక్షీ శుకీ శ్యేనీ కపోతికా
పాశహస్తా దండహస్తా ప్రచండా చండవిక్రమా
శిశుఘ్నీ పాపహంత్రీచ కాళీ రుధిరపాయినీ
వసాధయా గర్భభక్షా శివహస్తాంత్రమాలినీ
స్థూలకేశీ బృహత్కుక్షిః సర్పాస్యా ప్రేతవాహనా
దందశూకకరా క్రౌంచీ మృగశీర్షా వృకాననా
వ్యాత్తాస్యా ధూమనిఃశ్వాసా వ్యోమైకచరణోర్థ్వదృక్
తాపనీ శోషణీ దృష్టిః కోటరీ స్థూలనాసికా
విద్యుత్ప్రభా బలాకాస్యా మార్జారీ కటపూతనా
అట్టాట్టహాసా కామాక్షీ మృగాక్షీ మృగలోచనా’’
ఈ పై నామాలను ఎవరైతే ప్రతిదినం మూడుపూటలు.. జపిస్తారో
వారికి దుష్టబాధలు నశిస్తాయి. ఈ నామములు శిశువులకు శాంతికారకములు. స్త్రీలకు గర్భోపద్రవ నివారకములు. ఇలా అనేక పాపాల నుంచి విముక్తి కలిగిస్తాయి.