ఫెంగ్ షుయ్ కప్పనుఇంట్లో ఉంచటం ఎన్నో సమస్యలకు పరిష్కారం..?

మూడు కాళ్లు గల ఫెంగ్ షుయ్ కప్ప ని సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఫెంగ్ షుయ్‌ లో వాస్తు దోషాన్ని తొలగించడానికి , ప్రతికూల శక్తిని తొలగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. పండిట్ ఇంద్రమణి ఘన్శ్యాల్ తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో ఫెంగ్ షుయ్ కప్పను ఉంచడం వల్ల బ్రతికుల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది. దీంతో ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో ఫెంగ్ షుయ్ కప్పను ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.

ఫెంగ్ షుయ్ కప్పను మనీ ఫ్రాగ్ అని కూడా అంటారు. ఫెంగ్ షుయ్ కప్పను ఇంట్లో ఉంచటం వల్ల అదృష్టం, ఆనందం, శ్రేయస్సు, ఐశ్వర్యం లభిస్తాయి. ఈ మనీ ఫ్రాగ్ గా పిలవబడే ఈ కప్ప నోటిలో నాణెం ఉంటుంది. అందువల్ల వీకప్పను సంపద, శక్తి ,శ్రేయస్సుకి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇంట్లో డబ్బు కప్ప ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఈ మనీ ఫ్రాగ్ ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆదాయానికి అన్ని మార్గాలు తెచ్చుకొని ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.కానీ దానిని సరైన దిశలో ఉంచడం ముఖ్యం. అప్పుడే ప్రయోజనం ఉంటుంది.

ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఫెంగ్ షుయ్ కప్పను ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారు. ఇలా ఇంటి ముఖ ద్వారం వద్ద మనీ ఫ్రాగ్ ఉంచటం వల్ల ఇంట్లోకి పెద్దకూలశక్తి ప్రవేశించకుండా అడ్డుపడి ఇంట్లో సానుకూల శక్తి ఉండేలా చేస్తుంది. అలాగే ఈ కప్పను ఇంటి ముఖ ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంటికి ఉన్న అన్ని రకాల వాస్తు దోషాలు తొలగిపోయి కుటుంభ సభ్యులందరూ సుఖసంతోషాలతో జీవిస్తారు.
అయితే ఈ మనీ ఫ్రాగ్ ని పరమ పవిత్రంగా భావిస్తారు. అందువల్ల దీనిని ఇంటి వంటగది లేదా టాయిలెట్‌లో పొరపాటున కూడా ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో పేదరికాన్ని తీసుకువస్తుంది. ఇది కుటుంబంలో అసమ్మతి పరిస్థితిని సృష్టిస్తుంది, కాబట్టి ఈ ప్రదేశంలో ఫెంగ్ షుయ్ కప్పను ఉంచకూడదని మర్చిపోవద్దు