ఇంటి గుమ్మాన్ని వీటితో అలంకరిస్తే చాలు… ఇంట్లో ఉన్న సమస్యలు అన్ని దూరం?

సాధారణంగా ఒక ఇంట్లోకి ప్రవేశించడానికి ముందుగా ఇంటి ప్రధాన గుమ్మాన్ని దాటవలసి వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణ సమయంలోనే ముఖద్వారాన్ని పెద్దదిగా అందంగా ఉండేలా నిర్మించుకుంటారు. ఎందుకంటే ఆ ఇంటికి ఉన్న అందం మొత్తం ముఖద్వారం వల్లే వస్తుంది కాబట్టి. అయితే ఇంటి ముఖద్వారాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా అందంగా అలంకరించటం వల్ల ఇంట్లో ఎప్పుడు సానుకూల వాతావరణం ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసి అందంగా ముగ్గులతో పువ్వులతో అలంకరించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

• ముఖ్యంగా ఇంటి గుమ్మం ముందు తులసి చెట్టును ఉంచటం వల్ల ఇంటి ముఖ ద్వారం ఎంతో అందంగా ఉంటుంది. ఇంటి గుమ్మం ముందు ఇలా తులసి చెట్టు ఉంచడం వల్ల ఇంట్లోకి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. ఇంటి గుమ్మం ముందు తులసి చెట్టు ఉంచి పూజించటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉన్న సమస్యలు అన్ని దూరం అవుతాయి.
• స్వస్తిక్ గుర్తు శుభానికి చిహ్నంగా భావిస్తారు. అందువల్ల పూజా కార్యక్రమాలలో, ఏదైనా శుభకార్యాలలో స్వస్తిక్తుని శుభ సూచకంగా ఉంచుతారు. అందువల్ల ప్రతిరోజు ఇంటి గుమ్మం శుభ్రం చేసి ఇంటిముందు స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయి.
• శుభకార్యాలలో, పూజలలో పువ్వులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దేవతార్చనలో పూలకు ప్రత్యేక స్థానం ఉంది. అందువల్ల ప్రతిరోజు ఇంటి ముఖద్వారాన్ని పూలతో అందంగా అలంకరించటం వల్ల ఆ ఇల్లు అందంగా కనిపించడమే కాకుండా ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా కొత్త సంవత్సరం సందర్భంగా ఇంటిముక్క ద్వారా అన్ని అందంగా పువ్వులతో తోరణాలతో అలంకరిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం వల్ల ఆ సంవత్సరం మొత్తం ఎంతో సంతోషంగా గడిచిపోతుంది.