సాధారణంగా మనం ఏదైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తే ముందుగా ఆ వాహనాన్ని దేవుడి ఆలయం వద్దకు తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు చేయించి ఆ వాహనానికి ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండాలని ప్రతి ఒక్కరు పూజ చేయిస్తుంటారు. ఇలా పూజ చేసిన అనంతరం కొత్త వాహనానికి పండితులు నిమ్మకాయలు కట్టడం మనం చూస్తుంటాము.ఇలా కొత్త వాహనాలకు పూజ చేసిన అనంతరం నిమ్మకాయలు ఎందుకు కడతారు అసలు ఇలా కట్టడం వెనుక ఉన్న కారణమేంటి అనే విషయానికి వస్తే…
నవగ్రహాలలో అత్యంత ఎరుపు ఉగ్రతత్వం కలిగిన గ్రహాన్ని కుజ గ్రహం అంటారు. కుజ గ్రహం ప్రమాదాలకు కారకుడు.ఇక కుజు గ్రహానికి అత్యంత ప్రీతికరమైన వారం మంగళవారం అందుకే మంగళవారం ఎవరూ కూడా కొత్త వాహనాలను కొనుగోలు చేయరు. అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన పనులు దూర ప్రయాణాలను కూడా మంగళవారం వాయిదా వేసుకుంటారు. ఇక పులుపు శుక్ర గ్రహానికి ప్రీతికరం. శుక్రుడు సంపదకు మూల కారకుడు. కారం రవి గ్రహానికి సంబంధించినది. అలాగే అధికారానికి శాంతికి మూలకారకుడు రవి.
ఈ విధంగా వాహనం నడిపే వ్యక్తి ఎల్లప్పుడూ శాంతియుతంగా ఉండాలని ఉద్దేశంతో వాహనానికి మిరపకాయలు అలాగే సంపదకు శుభసూచికమైనటువంటి నిమ్మకాయలను కడతారు. ఇకపోతే శ్రీ మహాలక్ష్మికి తీపి పదార్థాలు ఎలా ఇష్టమో తన అక్క అలక్ష్మికి పులుపు కారం ఇష్టం అందుకే వాహనాలకు నిమ్మకాయలు మిరపకాయలు కట్టడం వల్ల ఆమె ఎంతో సంతోషించి మన వాహనాలకు ఏ విధమైనటువంటి ప్రమాదం కలుగకుండా కాపాడుతుందని భావిస్తారు.అయితే కొత్త వాహనాలకు మాత్రమే కాకుండా మిగతా సమయంలోను లేదా ఏదైనా పండుగ ఎప్పుడు మన దగ్గర ఉన్న వాహనాలను శుభ్రంగా కడిగి పండితులతో పూజ చేయించి ఇలా నిమ్మకాయలు మిరపకాయలను కట్టడం వల్ల వాహనానికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగదని భావిస్తారు.