మీ ఇంట్లో అదృష్ట దేవత తాండవించాలంటే ఈ విగ్రహాలు ఉంచితే సరి..?

మన హిందూ పురాణాలలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇల్లు నిర్మించే దగ్గర నుండి ఇంట్లో ఉంచే వస్తువుల వరకు ప్రతి దానిని వాస్తు ప్రకారం ఉంచుతూ ఉంటారు. ఇలా వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకొని ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని వాస్తు ప్రకారం అమర్చుకోవటం వల్ల ఇంట్లో అనుకూల శక్తి ఉంటుందని నమ్మకం. అయితే పొరపాటున కొన్ని వస్తువులను వాస్తు ప్రకారం ఉంచకపోవడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడి అనేక సమస్యలు ఎదుర్కోవల్సిన పరిస్థితి ఎదురవుతుంది. మన ఇంట్లో కొన్ని విగ్రహాలను వాస్తు ప్రకారం ఉంచటం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఉత్పన్నమవుతుంది. ఇలా ఇంట్లో ఆకర్షణగా ఉంచే కొన్ని విగ్రహాలు వాస్తు ప్రకారం ఉంచడం వల్ల కూడా అదృష్ట దేవత ఇంట్లో ప్రవేశిస్తుందని ప్రజల విశ్వాసం.

ఏనుగు విగ్రహం:
సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో ఆకర్షణ కోసం ఏనుగు విగ్రహాలను ఉంచుతూ ఉంటారు. వాస్తు ప్రకారం ఏనుగు విగ్రహాలను ఇంట్లో ఉంచడం శుభ పరిణామంగా భావిస్తారు. ఏనుగు విగ్రహం సంపదకు, ఐశ్వర్యానికి చిహ్నం గా భావిస్తారు. ఏనుగు విగ్రహాలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఆకర్షణగా కనిపించటమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఏనుగు విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయని నమ్మకం. ఇక ఈ ఏనుగు విగ్రహాలను పడకగదిలో ఉంచటం వల్ల వైవాహిక జీవితంలో కూడా ఎటువంటి కలహాలు ఉండవు.

గుర్రపు విగ్రహం :

ఇంట్లో గుర్రపు విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆకర్షణగా కనిపించటమే కాకుండా మనం చేసే ప్రతి పనిలోనూ విజయం, బలం లభిస్తుంది. ఇంట్లో ఉత్తర దిశలో గుర్రపు విగ్రహాన్ని ఉంచడం ద్వారా ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.

హంస విగ్రహం :
హంస విగ్రహాలు చూడటానికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఒక జంట హంస విగ్రహాలను ఇంట్లో నైరుతి దిశలో ఉంచటం వల్ల ఆనందం శ్రేయస్సు లభిస్తాయి.

తాబేలు విగ్రహం :
సాధారణంగా తాబేలు విగ్రహాన్ని సంపదకు ప్రతీకగా భావిస్తారు. ఇంట్లో, కార్యాలయాలలో,షాపులలో తూర్పు ఉత్తర దిశలలో తాబేలు విగ్రహాన్ని ఉంచటం వల్ల సంపద లభించడమే కాకుండా ఇంటిల్లిపాదికి ఆయుష్షు కూడా పెరుగుతుంది. అలాగే షాపులలో ఈ తాబేలు విగ్రహాలు ఉంచటం వల్ల వారి వ్యాపారం కూడా బాగా వృద్ధి చెందుతుంది.