కార్తీక శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు.. అమ్మవారి అనుగ్రహం మన పైనే?

తెలుగు క్యాలెండర్ ప్రకారం తెలుగు మాసాలలో కార్తీకమాసాన్ని ఎంతో పవిత్రమైన మాసం అని భావిస్తారు. కార్తీకమాసం మొత్తం పెద్ద ఎత్తున భక్తులు శివకేశవులను మాత్రమే కాకుండా లక్ష్మీస్వరూపిణి అయినటువంటి తులసిమాతను కూడా పూజిస్తూ ఉంటారు.ఇక కార్తీకమాసంలో వచ్చే శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మికి ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. అయితే కార్తీక శుక్రవారం అమ్మవారిని ఎలా పూజించాలి అనే విషయాన్ని వస్తే…

కార్తీక శుక్రవారం ఉదయమే నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించి లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా మహిళలు లక్ష్మీదేవిని పూజించే సమయంలో తెలుపు లేదా కనకాంబరం పుష్పాలను ధరించి పూజించడం మంచిది. ఇలా పూజ చేయడం వల్ల వారు దీర్ఘసుమంగళీగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఇకపోతే శుక్రవారం నాడు ఉపవాసం ఉన్నవారు ఒక పూట మాత్రమే భోజనం చేసి రెండు పూట్ల పండ్ల రసాలు తీసుకోవడం మంచిది.

ఇక శుక్రవారం సంధ్య సమయంలో తప్పనిసరిగా తులసి కోట ముందు దీపారాధన ముఖ్యం. ఈ విధంగా శుక్రవారం ఉదయం సాయంత్రం లక్ష్మీదేవి ఫోటో ముందు అలాగే తులసి కోటముందు దీపాలను వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మన ఇంటి అడుగుపెడుతుంది. ఇలా లక్ష్మీదేవి కరుణ కటాక్షాల కోసం శుక్రవారం ఈ విధంగా పూజ చేయడం ఎంతో మంచిది.