సాధారణంగా మనం కొన్ని రకాల జంతువులను అశుభసంకేతంగా భావిస్తూ ఉంటాము.మనం ఎక్కడికైనా బయలుదేరేముందు ఎదురుగా పిల్లి వచ్చిన ఏదో కీడు జరగబోతుందని మన ప్రయాణాలను రద్దు చేసుకుంటాము.అదేవిధంగా శని దేవుడికి వాహనమైనటువంటి కాకి తరుచూ మన ఇంటిపై అరవడం లేదా మన ఇంటి పరిసరాలలో తిరుగుతూ ఉండడం అశుభానికి సంకేతం అని భావిస్తాము. శనీశ్వరునికి వాహనమైన కాకి మన ఇంటి పరిసరాలలో తిరిగితే శని ప్రభావం మనపై ఉంటుందేమోనని ఆందోళన చెందుతుంటారు.
ఈ విధంగా కాకి అరవడం వల్ల శని ప్రభావం నిజంగానే మనపై ఉంటుందా కాకి అరవడం వల్ల అశుభం జరుగుతుందా అనే విషయానికి వస్తే… కాకి అరుపు అన్ని సందర్భాలలో అశుభం కాదని పండితులు చెబుతున్నారు. కాకి అరుపు కొన్ని సందర్భాలలో శుభసంకేతంగా పరిగణించబడుతుంది. కాకి మన ఇంట్లో ఆగ్నేయ దిశ వైపు ఎక్కువగా అరుస్తూ ఉంటే మన ఇంటికి ధన లాభం కలుగుతుందని భావిస్తారు అదేవిధంగా ఒక మనిషి ఎడమ వైపు నుంచి కాకి వెళితే వారు చేయబోయే పనులలో విజయం సాధిస్తారని అర్థం.
మన ఇంటికి ఎదురుగా కాకి అరుస్తూ ఉంటే మన ఇంటికి అనుకొని అతిథులు వస్తారని సంకేతం ఒకవేళ మన ఇంటి పరిసర ప్రాంతాలలో ఏదైనా మాంసపు ముక్కను, కాలిన చెక్కను కనక పడేస్తే సమీపంలో మన ఇంట్లో ఏదో చెడు జరగబోతుందని సంకేతం. ఇలా కాకి వివిధ రకాల దిశలలో అరవడం వల్ల వివిధ సంకేతాలు ఉంటాయి కనుక కాకి సంకేతం కాదు.. జరగబోయే పరిణామాలను కాకి అరుపు ద్వారా సంకేతం పంపుతుందని భావిస్తారు.