మన హిందూ సంస్కృతిలో పండగలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి పండగని ఎంతో సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు . ఇక కొన్ని రోజులలో రానున్న దీపావళి పండుగకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ ఈ పండుగను సాంప్రదాయబద్ధంగా, ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ పండగ రోజు నియమ నిష్ఠలతో లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఏడాది మొత్తం ఆ దేవి అనుగ్రహం పొందవచ్చు. అయితే లక్ష్మీదేవి దీపావళి రోజున ఇంట్లో అడుగు పెట్టాలంటే మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులు తీసివేయాల్సి ఉంటుంది.
వాస్తు ప్రకారం లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లో అడుగు పెట్టాలంటే కొన్ని అశుభకరమైన వస్తువులు తప్పకుండా తీసివేయాలి. ఇంట్లో పగిలిన విగ్రహాలు ఏవైనా ఉంటే వెంటనే వాటిని బయటపడేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి ఆ దేవి అనుగ్రహం పొందవచ్చు. అలాగె ఇంట్లో పగిలిపోయిన అద్దం ఉండటం కూడా అశుభానికి సంకేతం . అందువల్ల దీపావళి పండగకి ముందు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు పగిలిపోయిన అద్దాలను బయట పడేయడం మంచిది.
అలాగే దీపావళి పండుగకు ఇల్లు శుభ్రం చేసేటప్పుడు ఇంట్లో తుప్పు పట్టిన ఇనుము వస్తువులు ఉన్నా కూడా వాటిని బయటపడేయాలి లేదంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేము. అలాగే ఇంట్లో తలుపులు, కిటికీలు పాడైపోయి ఉంటే వాటిని వెంటనే మరమ్మతులు చేసి శబ్దం రాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా ఇంట్లో ఆగిపోయిన గోడ గడియారం కూడా ఉంచటం అశుభానికి సంకేతం. ఇలా నిలిచిపోయిన గోడ గడియారాన్ని ఇంట్లో ఉంచడం వల్ల అది మనకు చెడు సమయాన్ని సూచిస్తుంది.