పూజ సమయంలో ఇలాంటి పాత్రలను ఉపయోగిస్తే చాలు అమ్మవారి అనుగ్రహం మీ పైనే?

సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితం ఎంతో సంతోషంగా ఉండాలని వారి జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహం ఉండి సిరిసంపదలతో తూలతూగాలని భావిస్తారు.అందుకే పెద్ద ఎత్తున అమ్మవారి అనుగ్రహం కోసం మహాలక్ష్మిని ప్రార్థిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంట్లో కూడా నిత్యం పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. ఇకపోతే భగవంతుడిని పూజించే సమయంలో మనం పూజ సామాగ్రి విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపైనే ఉంటాయి.

ముఖ్యంగా ఇంట్లో వెండి లేదా ఇత్తడి విగ్రహాలను పెట్టి పూజించడం ఎంతో మంచిది. వెండి ప్లేట్ లో స్వామివారికి అభిషేకం నిర్వహించడం శుభ సూచికం. ఇకపోతే మనం దేవుడి ప్రసాదాన్ని ఇతరులకు పెట్టేటప్పుడు వెండి స్పూన్ తో పెట్టడం మంచిది. ఇక ఇంట్లో లక్ష్మీదేవి వెండి విగ్రహాలు, కామధేనువు వంటి విగ్రహాలు ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపైనే ఉంటుంది. ఇకపోతే మన ఇంట్లో దీపారాధన చేయడానికి ఇత్తడి ప్రమిదలు ఎంతో మంచిది.

ఈ విధంగా పూజ సమయంలో ఇత్తడి లేదా వెండి పాత్రలను ఉపయోగించడం వల్ల ఆ ఇంట్లో ఎల్లప్పుడు సిరిసంపదలకు ఏమాత్రం లోటు ఉండదు అదే విధంగా ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి. ఇలా పూజ సామాగ్రి విషయంలో ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో శుభ సూచికం.ఇకపోతే ఏ వ్యక్తి అయినా జాతక దోషంతో బాధపడుతూ ఉంటే అలాంటివారు ఇత్తడి సామాగ్రితో పూజలు చేయడం ఎంతో మంచిది.