ధనతేరస్ రోజున ఈ వస్తువులు కొంటే అష్టైశ్వర్యాలు మీ సొంతం..?

దీపావళి పండుగని ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగకు రెండు రోజుల ముందు ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. దీనిని ధనతేరస్ అని కూడా అంటారు. ఈ ధనతేరస్ రోజున కొన్ని వస్తువులను కొనటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ధనతేరస్ రోజున ఏ ఏ వస్తువులు కొనాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

*ధనతేరస్ రోజున బంగారం, వెండి, ఇత్తడి వంటి వస్తువులను కొనడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.

*అలాగే లక్ష్మీదేవికి శుభ్రత అంటే చాలా ఇష్టం. అందువల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందటానికి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ధన తేరస్ రోజున చీపురు కొనటం వల్ల కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఏడాది పాటు ఆర్థిక సమస్యలు దరి చేరవు.

* అలాగే ధనతేరస్ రోజున దీపాలు కొనుగోలు చేసే వాటిని వెలిగించడం వల్ల కూడా లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు.

* ఈ రోజున గోమతి చక్రాన్ని కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. ధన తేరస్ రోజున11 గోమతి చక్రాలను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గోమతీ చక్రాన్ని కొని పసుపు గుడ్డలో కట్టి ఉంచితే ఏడాది పాటు ఆర్థిక సమస్యలు దరిచేరవు.

*అంతే కాకుండా లక్ష్మి దేవికి ఇష్టమైన ధనతేరస్ రోజున ధనియాలు కొనటం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఆ తర్వాత ధనియాలు అమ్మవారికి సమర్పించి పొలంలో నాటటం వల్ల ఏడాది పాటు ఇంట్లో సంపదకు కొదువ ఉండదు.