శనీశ్వరుని అనుగ్రహం మన పై ఉండి శని దోషం పోవాలంటే ఇలా పూజించాల్సిందే?

సాధారణంగా చాలామంది శని దేవుడికి పూజ చేయడానికి ఎంతో సంకోచం వ్యక్తం చేస్తుంటారు. శనీశ్వరుడిని సరైన పద్ధతిలో పూజ చేయకపోవడం వల్ల శని అనుగ్రహం మనపై ఉంటుందని చాలా మంది భావిస్తారు అయితే శని దేవుడిని పూజించే సమయంలో కొన్ని పద్ధతులను పాటించి పూజించడం వల్ల శని అనుగ్రహం మనపై ఉండి శని దోషం లేకుండా శని ప్రభావం మనపై ఉండకుండా ఉంటుంది అయితే మరి శని దేవుణ్ణి ఎలా పూజించాలో ఇక్కడ తెలుసుకుందాం…

మనం శనీశ్వరుని ఆలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మనం ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శనిదేవుడికి ఇతర రంగులలో కాకుండా నలుపు రంగు వస్త్రాలను ధరించి పూజ చేయడం ఎంతో మంచిది. అదేవిధంగా ఎప్పుడూ కూడా శని దేవుడికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు. ఒక వైపుగా నిలబడి స్వామి వారిని ప్రార్థించే సమయంలో మాపై ఉన్నటువంటి మీ ప్రభావాన్ని తొలగించి శని గ్రహ దోషాలు తొలగిపోవాలని నమస్కరించాలి. అదేవిధంగా శని ఆలయం నుంచి బయటకు వచ్చే సమయంలో వెనుతిరిగి రావాలి కానీ దేవుడి వైపు వీపు చూపిస్తూ రాకూడదు.

ఇక శని దేవుడిని ముందు నమస్కరించే సమయంలో కళ్ళు మూసుకొని నమస్కరించడం లేదా శని పాదాల వైపు చూస్తూ నమస్కరించాలి కానీ స్వామి వారి కళ్ళ వైపు చూస్తూ అసలు నమస్కరించకూడదు.ఇక శని దేవుడికి మనం నువ్వుల నూనెను సమర్పించే సమయంలో రాగి పాత్రలో నూనెను తీసుకెళ్లి శనీశ్వరునికి సమర్పించకూడదు.కేవలం ఇనుప వస్తువులలో నువ్వుల నూనెను తీసుకెళ్లి స్వామివారికి సమర్పించినప్పుడు ఆయన అనుగ్రహం మనపై ఉంటుంది. ఇక రాగి సూర్యునికి ప్రీతికరమైనది కనుక శనీశ్వరునికి రాగితో నూనెను సమర్పించకూడదు.