సాధారణంగా గురువారం రోజున చాలామంది తలంటు స్నానం చేస్తూ ఉంటారు. అయితే గురువారం రోజున తలస్నానం చేయటం వల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే గురువారం బృహస్పతికి అంకితం చేయబడింది. ఈ గురువారం రోజున లక్ష్మీ సమేత మహావిష్ణువుని పూజించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే గురువారం రోజున ముఖ్యంగా పురుషులు కొన్ని పనులు చేయడం వల్ల మహావిష్ణువు ఆగ్రహానికి గురై అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. గురువారం రోజున పురుషులు చేయకూడని పనుల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మంగళవారం శుక్రవారాల్లో గోర్లు కత్తిరించకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే గురువారం రోజున కూడా పురుషులు గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం తీసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. గురువారం రోజున ఇలాంటి పనులు చేయటం వల్ల వారు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే గురువారం రోజున స్త్రీలు పురుషులు తలస్నానం కూడా చేయరాదు. ఇలా చేయటం వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. అలాగే గురువారం రోజున ఇంట్లో ఉన్న చెత్త పరవేయటం, పాత సామాన్లు అమ్మటం వంటి పనులు కూడా చేయరాదు. ఇలా చేయటం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు దూరం అవుతాయి.
అలాగే గురువారం రోజున పొరపాటున కూడా ఎవరి దగ్గర అప్పు చేయరాదు. అలాగే ఎవరైనా మన దగ్గరికి వచ్చి అప్పు అడిగినా కూడా అసలు ఇవ్వరాదు. ఇలా అప్పు చేయటం లేదా అప్పు ఇవ్వటం వంటి పనులు గురువారం రోజున చేయటం వల్ల మన జాతకంలో బృహస్పతి స్థానం బలహీనపడి కుటుంబ సభ్యులందరూ ఆర్థిక సంక్షోభంతో బాధ పడవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. స్త్రీ పురుషులు గురువారం రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకపోవడం వల్ల అనేక సమస్యల నుండి విముక్తి పొందవచ్చు.