నేడే ఉత్థాన ఏకాదశి ఈరోజు ఏం పనులు చేయాలి ఏం చేయకూడదో తెలుసా?

మన హిందూ శాస్త్రం ప్రకారం నెలకు రెండు ఏకాదశలు వస్తాయి. ఇలా సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ఒక్కో ఏకాదశి ఒక్కో విశిష్టత ఉంటుంది. ఈ క్రమంలోనే కార్తీకమాసంలో వచ్చే కార్తీకశుద్ధ ఏకాదశికే భోధన ఏకాదశి, దేవ-ప్రబోధిని ఏకాదశి, ఉత్థాన ఏకాదశి అని కూడా అంటారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున విష్ణుమూర్తి కార్తీక ఏకాదశి రోజున మేల్కొంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఎంతో ప్రత్యేకమైనటువంటి బోధన ఏకాదశి రోజున ఎలాంటి పనులు చేయాలి ఎం పనులు చేయకూడదనే విషయానికి వస్తే…

ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నది స్నానమాచరించాలి. స్నానం అనంతరం విష్ణుమూర్తికి కుంకుమ పాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం హారతులు ఇవ్వాలి. బోధన ఏకాదశి రోజు విష్ణుమూర్తికి తెలుపు రంగు నైవేద్యాలను సమర్పించడం ఎంతో శుభప్రదం. విష్ణుమూర్తికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతికరం కనుక తెలుపు వస్తువులను నైవేద్యంగా సమర్పించడం ఎంతో మంచిది. ఇక ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల శ్రీహరి అనుగ్రహం మనపై ఉంటుంది.

దేవుత్తని ఏకాదశి రోజున ఏకాదశి వ్రతం పాటించేవారు పొరపాటున కూడా అన్నం తినకూడదు. ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి అన్నం తినకూడదు. ఉపవాస సమయంలో ఎవరితోనో కోపాలకు పోకుండా గొడవలకు వెళ్లకుండా దైవచింతనతో ఉండాలి. అలాగే వృద్ధులకు సహాయం చేయడం ఎంతో మంచిది. ఇక నేడు ఉపవాసం లేకపోయినా సాత్విక ఆహారం తీసుకోవాలి వీలైనంతవరకు ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండటం మంచిది. అలాగే ఇంట్లో మద్యం మాంసం వంటి వాటిని కూడా తినకూడదు తాగకూడదు.