ఆలయానికి వెళ్లే ముందు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఏంటో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తరచూ మనం ఆలయాలకు వెళ్లి భగవంతుడిని నమస్కరించుకోవడం వల్ల మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాకుండా మనం తరచూ దేవునికి వెళ్లి దేవుడు చల్లని కృప మనపై ఉండాలని ప్రార్థించడం వల్ల స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుందని చెబుతారు.ఈ విధంగా భగవంతుడి కరుణ కటాక్షాలు మనపై ఉండాలంటే ఆలయాలకు వెళ్లి ప్రార్థించాలని మరికొందరు భావిస్తుంటారు. అయితే మనం ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇష్టానుసారంగా వెళ్లకుండా ఆలయంలో కూడా కొన్ని నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.

మనం ఆలయానికి వెళ్ళినప్పుడు ఏవిధమైనటువంటి నియమాలు పాటించాలి అనే విషయానికి వస్తే మనం ఆలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కాళ్లు కడుక్కొని లోపలికి వెళ్లాలి.లోపలికి వెళ్ళగానే ఆలయం చుట్టు ప్రదక్షిణాలు చేయకుండా ముందుగా స్వామి వారిని నమస్కరించుకొని అనంతరం ప్రదక్షణలు చేయాలి.ఇలా ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో మాత్రమే ఆలయ ధ్వజస్తంభం నీడను దాటవచ్చు అంతకుమించి ఇతర సమయాలలో ఆలయ ధ్వజస్తంభం నీడను దాటకూడదు.

ఇక స్వామివారి సన్నిధిలో ఉన్నప్పుడు మన మనసు ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలతోనే నిండి ఉండాలి.మన క్షేమం కోరుకొని భగవంతుని కృప మనపై ఉండాలని కోరుకోవాలి తప్ప ఆలయంలోకి వెళ్లి ఇతరుల నాశనం కోరుకోకూడదు. ఇక స్వామివారి పూజ అనంతరం ఆలయంలో కాసేపు కూర్చొని వెళ్లాలి.అయితే స్వామివారి సన్నిధిలో ఉన్నప్పుడు స్వామివారికి వీపుని చూపిస్తూ కూర్చోవడం అలాగే వెళ్లేటప్పుడు వీపు చూపిస్తూ వెళ్లకూడదు.ఇక ఆలయానికి వెళ్లేవారు తప్పనిసరిగా సూచి శుభ్రంగా ఉన్న దుస్తులను వేసుకొని వెళ్లాలి ఇక ఆలయం వెలుపల నుంచి వచ్చేటప్పుడు మనకు తోచినది అక్కడ ఉన్నటువంటి యాచకులకు సహాయం చేయడం వల్ల భగవంతుడు కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి.