అయ్యప్ప మాల ధరించేవారు నలుపురంగు దుస్తులు ధరించటానికి కారణం ఏమిటో తెలుసా?

సాధారణంగా కొంతమంది భక్తులు వారి ఇష్టదైవాన్ని ఎల్లప్పుడూ పూజిస్తూ ఉంటారు. అంతే కాకుండ వారి ఇష్టదైవానికి సంబందించిన మాలలు ధరించి నిష్టగా ఉంటూ నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. ఇలా అయ్యప్ప స్వామి భక్తులు కూడా కార్తీకమాసం మొదలు కాగానే అయ్యప్ప మాల ధరిస్తారు. ఈ కార్తీక మాసంలో శివ మాల కూడా ధరిస్తారు. అయితే శివ మాల ధరించే వ్యక్తులు గోధుమ రంగు దుస్తులను ధరిస్తారు. ఇక అయ్యప్ప మాల ధరించే భక్తులు నలుపు రంగు దుస్తులు ధరిస్తారు. అయితే నలుపు రంగు ని అశుభానికి ప్రతీకగా భావిస్తారు. మరి అయ్యప్ప భక్తులు నలుపురంగు దుస్తులు ధరించటానికి గల కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అయ్యప్ప మాల ధరించే భక్తులు 41 రోజుల పాటు చాలా నిష్టగా ఆ దేవుణ్ణి పూజిస్తూ దీక్షలో ఉండాలి. అయితే అయ్యప్ప భక్తులు నల్లటి దుస్తులు ధరించటానికి ముఖ్య కారణం.. ఈ అయ్యప్ప మాల చలికాలంలో వేయటం. సాధారణంగా నలుపు రంగు ఎక్కువ వేడిని కలిగిస్తుంది. చలికాలంలో నలుపు రంగు దుస్తులు ధరించటం వల్ల శరీరం చలి తీవ్రత తట్టుకుంటుంది. అంతే కాకుండా స్వామివారిని దర్శించటానికి భక్తులు అడవుల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వాహనాలలో వెళ్తున్నారు. పూర్వం కాలినడకన కొండ ఎక్కేవారు కాబట్టి క్రూర జంతువుల నుంచి తమను తాము రక్షించుకోవడానికి నలుపు రంగు దుస్తులను ధరిస్తారు.

అయ్యప్ప భక్తుల 18 కొండలు ఎక్కి 18 మెట్లు ఎక్కి ఆ అయ్యప్పను దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున వెలిగే అయ్యప్ప కొండపై వెలిగే మకర జ్యోతి ని చూడటంతో భక్తుల జన్మ దన్యమవుతుంది. స్వామివారిని దర్శించి విరుముడి స్వామికి సమర్పించిన తర్వాత భక్తులు మాల నుంచి విముక్తి పొందుతారు.కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములు మాల ధరించి సంక్రాంతి వరకు నియమ నిష్టలతో ఉండి మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి దర్శనం చేసుకుంటారు