ఈ దేవతలను పూజించటం వల్ల శని దృష్టి నుండి విముక్తి పొందవచ్చు తెలుసా..?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో శని దోష ఉండటంవల్ల అనేక సమస్యలు ఎదురై జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. ఆ సమస్యలను భరించలేక చాలామంది మనస్థాపంతో ఆత్మహత్యలకు కూడా పాల్పడుతూ ఉంటారు. అందువల్ల శని దోషం తొలగిపోవడానికి చాలామంది అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయినప్పటికీ మనపై శని దేవుడి దృష్టి తొలగిపోనంతవరకు కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. ఇలా శని దోషం వల్ల ఇబ్బంది పడుతున్న వారు శని దేవుడికి పూజలు పరిహారాలు చేయడమే కాకుండా ఆయనకు ఇష్టమైన దేవతలను పూజించటం వల్ల కూడా ఆ శని ప్రభావం నుండి విముక్తి పొందవచ్చునని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఏ దేవతలను పూజించటం వల్ల శనిదోషం తొలగిపోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శని దేవుడు కుంభరాశిలో సంచరించిన తర్వాత కృష్ణుడి ని పూజించడం వల్ల శని ప్రభావం తొలగిపోయి సమస్యలు దూరం అవుతాయి . అలాగే మనం కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. కుంభ రాశిలో శని సంచారం తర్వాత శివ భక్తులకు కూడా శని దోషం తొలగిపోయి శని అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అందువల్ల శివ భక్తులంతా శని దేవుని పూజించడమే కాకుండా శివనామస్మరణ చేయాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

శని దేవుడికి మంగళవారం, శనివారం ఇష్టమైన రోజులు. ఈరోజులలో శనిదేవుని పూజించటం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చు. అయితే ఈ రోజుల్లో శని దేవుని పూజించే సమయంలో కూడా కొన్ని నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించినప్పుడే శని దోషం తొలగిపోయి అనుగ్రహం లభిస్తుంది. అయితే మంగళవారం రోజున శని దేవుని మాత్రమే కాకుండా హనుమంతుడిని కూడా పూజించటం శుభప్రదంగా భావించవచ్చు. అందువల్ల మంగళవారం రోజున శని దేవుడితో పాటు హనుమంతుడిని కూడా పూజించటం వల్ల శని దోషం తొలగిపోయి శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. దీంతో ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి.