పూజ చేసిన తర్వాత ధూపం వేస్తున్నారా… అయితే ఇవి తెలుసుకోవాల్సిందే?

మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించడం సర్వసాధారణం.ఈ విధంగా ఉదయం లేదా సాయంత్రం పెద్ద ఎత్తున పూజలను నిర్వహిస్తూ పూజ అనంతరం ధూపం వేయడం చేస్తుంటాము.ఇలా ఇంట్లో ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని భావిస్తారు. అందుకే పూజ తర్వాత ప్రతి ఒక్కరి ఇంటిలో ధూపం వేయడం జరుగుతుంది.

ఇలా పూజ చేసిన తర్వాత ధూపం వేసే సమయంలో కొన్ని పద్ధతులను పాటించడం వల్ల అంతా శుభమే కలుగుతుంది.ఎవరి ఇంట్లో అయితే డబ్బులు చేతిలో నిలబడకుండా అనవసరపు ఖర్చులు వస్తుంటాయో అలాంటివారు ధూపం వేసే సమయంలో కాస్త చందనం వేసి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఆనందంతోపాటు సంపద శ్రేయస్సు కూడా పెరుగుతుంది.అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య సరైన అవగాహన లోపించడం ఇరువురి మధ్య మనస్పర్ధలు రావడం జరుగుతుంటే అలాంటివారు కాస్త ఆవాలుతో ధూపం వేయడం మంచిది.

ఇక మన ఇంట్లో చెడు ప్రభావాలు కలుగుతూ ఏ పని చేసిన నష్టాలు కలుగుతూ ఉంటే అలాంటి వారు ధూపం వేసే సమయంలో కాస్త కుంకుమపువ్వు రేకులను 21 రోజులపాటు క్రమంగా ధూపం వేయటం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావాలు తొలగిపోవడమే కాకుండా మనం చేపట్టే పనులలో విజయం కలుగుతుంది.ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతూ ఉంటే అలాంటివారు లవంగం పొడితో ధూపం వేయటం అనవసరపు ఖర్చులు తగ్గి ఇంట్లో లక్ష్మి నిలుస్తుందని పండితులు చెబుతున్నారు. వృధాగా డబ్బు ఖర్చు అయ్యేవారు లవంగం పొడితో ధూపం వేయడం మంచిది.