ఈ పుష్పాలతో పూజ మాత్రమే కాదు వాస్తు దోషాలను కూడా తొలగించవచ్చు తెలుసా?

సాధారణంగా పుష్పాలు ఇంటి అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఆ దేవదేవతలను ప్రసన్నం చేసుకోవడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటాము.ఈ క్రమంలోనే వివిధ రకాల పుష్పాలతో ఎంతో అందంగా అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటాము. అయితే మన ఇంటి ఆవరణంలో వికసించే ఎర్రటి మందార పుష్పాలు చూడటానికి ఎంతో ఆహ్లాదకరంగా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ఈ పుష్పాలతో లక్ష్మీదేవికి ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల వారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటాయి.

ఇకపోతే ఎర్రటి మందార పుష్పాలతో సూర్యదేవుడికి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఉండాలి. ఈ పుష్పాలు లేకపోతే సూర్యుని పూజ అసంపూర్ణం. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తున్నప్పుడు ఎర్రటి మందారాలు తప్పనిసరి. ఇలా పూజకు ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఎర్ర మందారాలు వాస్తు దోషాలను కూడా నివారిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో తూర్పు వైపున ఎర్రటి మందారం చెట్టు ఉంటే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.

అంగారకుడి రంగు ఎరుపు జాతకంలో కుజదోషం మంగళ దోషం ఉన్నటువంటి వారికి ఆలస్యంగా వివాహం కావడం, వివాహం జరిగినప్పటికీ భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడంవంటి దోషాలతో బాధపడుతుంటారు ఇలాంటి దోషాలు ఉన్నవారు ఇంటిలో ఎరుపు మందారపు చెట్టును నాటడం వల్ల దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.ఇలా ఎర్రటి మందారాలతో పూజ మాత్రమే కాదు గ్రహ దోషాలను, వాస్తు దోషాలను కూడా తొలగించుకోవచ్చు.