అన్నాచెల్లెళ్ల బంధానికి ఎంతో ప్రత్యేకంగా జరుపుకునే పండుగలు రాఖీ పౌర్ణమి ఒకటి. ఈ పండుగ తర్వాత అన్నా చెల్లెలు అంతే పవిత్రంగా జరుపుకొని పండుగలలో భగనీ హస్త భోజనం ఒకటి. ఈరోజు అన్నా చెల్లెలు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఏడాది దీపావళి తరువాత రెండవ రోజున జరుపుకుంటారు.కార్తీక శుద్ధ విదియ రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పర్వదినాన అన్న తమ్ముళ్లు తమ అక్కచెల్లెళ్ల ఇంటికి వెళ్లి వారి చేత నుదటిపై కుంకుమ తిలకం దిద్దించుకొని అనంతరం వారి చేతితో వండిన ఆహారాన్ని తిని వస్తారు ఇలా సోదరి ఇంట భోజనం చేయడాన్న భగనీ హస్తభోజనం అని పిలుస్తారు.
పురాణాల ప్రకారం ఈ పండుగ విశిష్టత ఏమిటి అనే విషయానికి వస్తే…సూర్యభగవానుడు కుమార్తె యమున పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంది. అయితే యమునా సోదరుడు యముడు ఒక్కసారి కూడా తన అత్తవారింటికి వెళ్లడు. ఇలా నరకంలో పాపులకు శిక్షలు విధిస్తూ ఆయనకు సమయం కుదరక కొన్ని సంవత్సరాలు గడిచిన తన సోదరి ఇంటికి వెళ్ళడు. అయితే కార్తీక శుద్ధ విదియ రోజున తన చెల్లెలను చూడటానికి యముడు యమునా ఇంటికి వెళ్తాడు. తన అన్నయ్య వచ్చారన్న సంతోషంలో యమునా తన అన్నయ్యకు ఇష్టమైన ఆహార పదార్థాలను వండి ప్రేమగా అన్నయ్యకు కొసిరికొసరి తిని పెడుతుంది.
ఈ విధంగా తనకు ఎంతో ఇష్టమైన ఆహార పదార్థాలను వండిపెట్టిన యమునకు ఏదైనా ఇవ్వాలని యముడు భావిస్తాడు. ఈ క్రమంలోనే ఏదైనా వరం కావాలని కోరుకో అంటూ యముడు అడగగా అప్పుడు యమునా లోక కళ్యాణం కోసం ఒక వరం ఇవ్వు అన్నయ్య అంటూ వరం అడుగుతుంది.కార్తీక శుద్ధ విధియే రోజు ఎవరైతే తమ సోదరుల ఇంటికి వెళ్లి తమ అక్క చెల్లెల చేతి వంటను తింటారో అలాంటి వారికి ఆయురారోగ్యాలతో పాటు అకాల మరణం నుంచి కూడా వారిని తప్పించి వారికి నిండు నూరేళ్లు ఆయుష్షు కలిగించు అనే వరం అడుగుతుందట.ఇది విన్నటువంటి యమధర్మరాజు లోక కళ్యాణం కోసం నువ్వు ఈ వరం అడిగావు కనుక తధాస్తు అని తన చెల్లెలకు వరం ఇస్తాడు. ఈ విధంగా కార్తీక మాసం శుద్ధ విదియ రోజు అన్నా తమ్ముళ్లు తమ అక్క చెల్లెల్ల ఇంటికి వెళ్లి భోజనం చేయడం ఆనవాయితీగా ఉంటుంది అయితే ఈ పండుగను ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకుంటారు.