రుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ప్రారంభమయ్యాయి. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సాయంత్రం 6:03 నుంచి 6:30 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం కనులపండువగా నిర్వహించారు. అంతకుముందు గరుడ పటాన్ని అంతరాలయంలో ఊరేగించి బ్రహ్మాదిదేవతలను ఆహ్వానిస్తూ ఎగురవేశారు.
రాత్రి 8:30 నుంచి 9:30 గంటలకు పెద్దశేష వాహనసేవ నిర్వహించారు. శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారం లోని కల్యాణమండపంలో శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారు పెద్దశేషుని అధిరోహించగా అర్చకులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు తొలి వాహనమైన ఏడుపడగల ఆదిశేషునిపై ఉభయదేవేరులతో భక్తులకు అభయప్రదానం చేశారు. కొవిడ్ నిబంధనలతో వాహనసేవను ఏకాంతాంగా నిర్వహించారు.