శ్రీరామనవమి వేడుకలకు సిద్ధమైన భద్రాచలం

శ్రీ‌రామ‌న‌వ‌మి అన‌గానే మ‌న‌కు ముందు గ‌ర్తొచ్చే పుణ్య క్షేత్రం భ‌ద్రాచ‌లం. ఇక్క‌డ శ్రీ‌రాముని క‌ళ్యాణ మ‌హోత్స‌వాన్ని ఎంతో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుపుతారు. స్థలపురాణం ప్రకారం రాములవారు సీతమ్మను వెతుక్కుంటూ ఇక్కడ భద్ర అనే మహర్షిని కలుసుకున్నారని పూర్వీకులు చెబుతుంటారు.ఈ ప‌ది రోజు భ‌ద్రాచ‌లంలో రాముల‌వారి ఆల‌యం వెలుగులు జిమ్ముతూ.. విద్యుత్ దీపాల మధ్య భద్రాద్రి ఆలయం మెరిసిపోతోంది. భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల ఎదుర్కోలు ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున వ‌స్తారు.

ఇక ఈ ఏట ఈ ఉత్స‌వాన్ని మార్చి 25 నుంచి ఏప్రిల్‍8 వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి దేవస్థానం కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ఈ సంవ‌త్స‌రం 2020న షెడ్యూల్‍ ను తెలిపింది. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి జ‌రిపే తేదీకి భద్రాచలం ముహూర్తానికే ప్రాధాన్య‌త‌నిస్తారు. అందుకే ఈ షెడ్యూల్‍ కోసం దేవస్థానాలు ఎంతో ఓపిక‌గా ఎదురు చూస్తుంటాయి.

ఏప్రిల్‍2వ తారీఖున‌ శ్రీరామనవమి సీతారాముల కల్యాణం, 3న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నార‌ని స‌మాచారం. ఈ మేరకు వైదిక కమిటీ ఉత్సవ వివరాలను శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఈవో గదరాజుకు సమర్పించారు. ఈ షెడ్యూల్‍ను ఎండోమెంట్‍ కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఇక ఈ షెడ్యూల్ ప్ర‌కార‌మే ప్ర‌తిఒక్క‌రు న‌డుచుకుంటారు.