భవిష్యోత్తర పురాణములో రథ సప్తమి వ్రత విధానము విశేషంగా వర్ణించబడినది.
రథ సప్తమి రోజున స్నానం , పూజ , వ్రతం ఇలాంటివన్నీ ఆచరించాలి. మా+అఘ=పాపంలేనిది – పుణ్యాన్ని కల్గించేది. మనం చేసే పూజలూ, వ్రతాలూ అన్నీ పుణ్యసంపాదన కొరకే. శివకేశవులకు ఇరువురికీ మాఘం ప్రీతికరమైనదే! ఉత్తరాయణం మకరసంక్రమణంతో ప్రారంభమైనా – రధసప్తమి నుండియే పూర్తిగా ఉత్తరాయణ స్పూర్తి గోచరిస్తుంది. ఈ నాటి నుండి వేసవి ప్రారంభమైనట్లే!
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ – ఆరోగ్య ప్రదాతగా శ్రీ సూర్యదేవుని చెప్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ శ్రద్ధ లతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం.
మాఘ శుద్ద షష్టి నాడు నూరిన నువ్వుల ముద్దతో శరీరానికి నలుగు పెట్టుకుని అందుబాటులో వున్న నది, చెరువు దగ్గర స్నానం చేయాలి. ఈ రోజు అంటె మాఘ శుద్ధ షష్టి రోజున ఉపవాసం ఉండి సూర్య ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి. ఆ మర్నాడు అంటే సప్తమి తిధిన సూర్యోదయానికి ముందే మాఘ స్నానంచేయాలి. సప్తమి రోజు ఉదయాన్నే ఇంటి దగరె స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకుని నదీ స్నానం చేయడానికి వెళ్ళాలి. ఇంట్లో స్నానం చేయకుండా , విప్పిన బట్టలు కట్టుకుని నది స్నానం చేయకూడదు. నది స్నానానికి వెళ్ళే ముందు చిక్కుడు ఆకుల్లో దీపం వెలిగించి నెత్తి మీద జాగ్రత్త గా పెట్టుకుని నదిలో నెమ్మదిగా మునిగి ఆ దీపం నీళ్లలో తేలుకుంటూ ముందుకు సాగి వెల్లెలాగ సూర్యోదయ సమయాన స్నానం చేస్తే చాలా మంచిది అని పూర్వీకులు చెబుతుంటారు.
స్నానాతరం గట్టు దగ్గర పొడి బట్టలు మార్చుకుని పూజ చేయాలి. అష్టదల పద్మం ముగ్గు (బియ్యం పిండి తో ) వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి . అష్ట దళ పద్మ మద్య లో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రధాని (7 గుర్రాలు) నడుపుతున్న బంగారు ప్రతిమ లేదా బంగారు రథమును అచ్చు చేయించి కుంకుమాదులు దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగుగల పువ్వులు సూర్యుని ప్రతిమ నుంచి సూర్యుడికి పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలి ఎవరి రోగ నివారణ కోసం చెస్తునామొ లేదా ఎవరికీ సంతానం కలగాలని చెస్తునామొ వారి పేరు గోత్రనామలు చెప్పుకొని పూజ చేసి ఈ బంగారు ప్రతిమను ఒక గురువునకు లేదా బ్రాహ్మణుడికి దానం ఇవాలి . తరువాత ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి. ఈ సంవత్సర కాలం నియమంగా నిష్టగా గ ఉండాలి .