నమాజు యొక్క ప్రాముఖ్య‌త‌

శుక్రవారం నాడు ముస్లింల‌కు ఎంతో ముఖ్య‌మైన రోజుగా భావిస్తారు. ఎందుకంటే శుక్ర‌వారం అల్లాకి ఎంతో ప్రీతిప‌ద‌మైన రోజు. నమాజు కై పిలిచినప్పుడు, అల్లాహ్ సంస్మరణ వైపునకు పరుగెత్తాలి. క్రయవిక్రయాలను వదలిపెట్టాలి. మీరు గ్రహించగలిగితే, ఇదే మీకు అత్యంత శ్రేయస్కరమైనది!

కొందరు వ్యాపారులు రెండవ అజాన్‌ తరువాత కూడా తమ దుకాణాల్లో లేక మస్టిద్‌ ముందు అమ్మకాల్లో నిమగ్నులయి ఉంటారు. అయితే వారితో కొనేవాడు కనీసం మిస్వాక్‌ కొన్నా వారితో పాపంలో పొత్తు కలిసి నట్లే. ఇలాంటి వ్యాపారం వ్యర్థము, తుచ్చము అన్నదే సత్యం.

హోటల్‌, బేకరి మరియు ఫ్యాక్టరీల ఓనర్లు కొందరు జుమా సమయంలో కూడా పని చేయాలని తమ పనివాళ్ళ పై ఒత్తిడి చేస్తారు. అలాంటి సంపాదనలో బాహ్యంగా ఎక్కువ లాభం ఏర్పడినా, వాస్తవానికి వారు నష్టంలో పడి ఉన్నారన్నది తెలుసుకోవాలి. ఇక పనివాళ్ళు ప్రవక్త ఈ యొక్క ఈ ఆదేశంపై నడవాలి. అలాగే జుమా న‌మాజ్ లో స్పెష‌ల్ న‌మాజ్ ఉంటుంది. జొహ‌ర్‌లో చ‌దివే న‌మాజ్‌లో రెండు క‌ల‌మాలు ఎక్కువ‌గా ఉంటాయి. కాస్త స‌మ‌యం ప‌డుతుంది. కానీ జుమా న‌మాజ్ చ‌ద‌వ‌డం వ‌ల్ల ఎంతో మ‌న‌శ్వాంతి, మంచి క‌లుగుతుంది. అలాగే శుక్ర‌వారం రోజున చాలా మంది ముస్లింలు అన్నం వండిన వెంట‌నే ఒక ప్లేటు అన్నం కూర తీసి ఎవ‌రికైనా దానం ఇవ్వ‌డం వ‌ల్ల చాలా మంచిది. అన్నం క‌న్నా రోటీ ఇంకా మంచిది శుక్ర‌వారం రోజు ఏ దానం ఇచ్చినా అందుకు డ‌బుల్ ఆ అల్లా మ‌న‌కు ఇస్తాడు. అలాగే శుక్ర‌వారం పూట గుసుల్ (శుద్ధి స్నానం చేయటం) స్నానం చేయటం ఎంతో మంచిది. దివ్యఖుర్ఆన్ లోని అల్ మాయిద 5׃6 “వ ఇన్ కున్ తుమ్ జునుబన్ ఫత్తహ్హరూ ”-“మీరు అపరిశుద్ధులుగా ఉంటే స్నానం చేసి శుద్ధులు కండి”.