హైదరాబాద్ నారాయణగూడ శాంతి థియేటర్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో న్యాయవాది ప్రవీణ్ అక్కడికక్కడే చనిపోయాడు. శుక్రవారం ఉదయం ప్రవీణ్ తన కుమార్తెను బైక్ పై కాలేజికి తీసుకెళుతుండగా వీరి బైక్ ను మరో బైక్ ఢీకొట్టింది. దీంతో ప్రవీణ్ రోడ్డు పై పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో ప్రవీణ్ అక్కడికక్కడే చనిపోయాడు. తన కుమార్తె కుడి చేయికి తీవ్ర గాయాలయ్యాయి.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రవీణ్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ప్రవీణ్ కుమార్తెను ఆస్పత్రికి తరలించారు. ప్రవీణ్ మృతితో అతని కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.