బిసి ల ఆకాంక్షలను ఓసిల అంగట్లో పెట్టేవారే ‘‘బిసి బిసి’’ అంటున్నారు

(నీలం వెంకన్న)

ఇది బీసీ ఉద్యమం కాదు, బీసీ హడావిడి. ఉద్యమరూపం తీసుకోవడానికి నాయకత్వానికి విశ్వసనీయత, చిత్తశుద్ధి కావాలి. కానీ ఇప్పుడు బీసీ హడావిడి చేస్తున్నవారికి అవి లోపించాయని నా అభిప్రాయం.

ఇప్పుడున్నది బీసీ 2.0 జనరేషన్. కొత్త జనరేషన్ కు కొత్త నాయకత్వం కావాలి. బీసీల ఆకాంక్షల్ని, ఓసీల అంగట్లో పెట్టేవారే బీసీ బీసీ అని అంటే జనం నమ్మడంలేదు. అందుకే మీరు చూస్తూ ఉండండి. వీళ్ల హడావిడి ఇలా కొనసాగుతుండగానే ప్రభుత్వం తన పంథాలో తాను జంకు లేకండా పంచాయతీ ఎన్నికల్ని సక్సెస్ ఫుల్ గ నిర్వహిస్తుంది.

అన్నికులాల్లోనూ మలిదశ కుల ఉద్యమాలు, మలిదశ బీసీ ఉద్యమం జరగాలి. అంటే రజక 2.0, వడ్డెర 2.0, మేదర 2.0,గొల్ల 2.0, గౌడ2.0, ముదిరాజ్ 2.0, పద్మశాలి 2.0, బెస్త 2.0 ఇలా ఆయాకులాలు తమ ఆకాంక్షల వ్యక్తీకరణకు సరికొత్త గొంతులు ముందుకు రావాలి. స్వభిమానం, విశ్వసనీయత, చిత్తశుద్ధి ఉన్న కొత్తతరం నాయకులు నాయకత్వం వహించాలి.

Then only movement will success.

 

* (సీనియర్ జర్నలిస్టు నీలం వెంకన్న ఫేస్ బుక్ వాల్ నుంచి సేకరణ)